అల్లు పెద్ద కుమారుడు.. ఏం చేస్తున్నాడు?

Tue Jan 24 2023 23:00:01 GMT+0530 (India Standard Time)

What Allu Bobby is Doing

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పాన్ ఇండియా హీరోగా దూసుకుపోతున్నాడు. అయితే అల్లు అర్జున్ స్థాయిలో ఆ ఫ్యామిలీ నుంచి మిగిలిన అన్నదమ్ములు ఇద్దరు సక్సెస్ కాలేదని చెప్పాలి. బన్నీ తమ్ముడు అనే బ్రాండ్ తో హీరోగా అడుగుపెట్టిన అల్లు శిరీష్ అడపాదడపా సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నాడు.చివరిగా గత ఏడాది ఊర్వశివో రాక్షశివో అనే సినిమాతో అల్లు శిరీష్ ప్రేక్షకుల ముందుకి వచ్చాడు. ఈ మూవీకి ఎవరేజ్ టాక్ వచ్చింది. కథాబలం ఉన్నా కూడా ఎందుకనో ప్రేక్షకులకి రీచ్ కాలేదు.

 ఇక అల్లు అర్జున్ అన్నయ్య అల్లు బాబీ సినిమా ఇండస్ట్రీలో లేకపోయిన గీతా ఆర్ట్స్ వ్యవహారాలు చూసుకునేవాడు. అలాగే తాను కూడా సొంతగా వ్యాపారాలు చేస్తున్నాడు. ఈ నేపధ్యంలో సినిమా సర్కిల్ లో పెద్దగా కనిపించే వాడు కాదు.

అయితే ఎందుకనో గీతా ఆర్ట్స్ బ్యానర్ కాకుండా తానే సొంతగా బ్యానర్ బెట్టి వేరొకరితో కలిసి వరుణ్ తేజ్ తో గని అనే సినిమాని భారీ బడ్జెట్ తో నిర్మించారు. ఈ సినిమా డిజాస్టర్ అయ్యింది. వరుణ్ తేజ్ కెరియర్ లో చెత్త సినిమాలలో ఈ మూవీ ఒకటిగా మారిపోయింది.

.గని సినిమాలో క్యారెక్టర్ కోసం వరుణ్ తేజ్ చాలా కష్టపడి ఫిట్ న్యూస్ బాక్సర్ లుక్ ని పెంచుకున్నాడు. అయితే ఆ కష్టం అంతా సినిమా రిలీజ్ తర్వాత వృధా అయిపొయింది. ఇక గని కొట్టిన దెబ్బతో అల్లు బాబీ ఇక ప్రొడ్యూసర్ గా ట్రై చేయడం మానేసాడు. గని తర్వాత ఓ వెబ్ సిరీస్ నిర్మించాలని ప్లాన్ చేశాడు. దానిని కూడా పక్కన పెట్టి ఇప్పుడు ఆహా ఒటీటీలో కోసం కథలు వింటున్నట్లు తెలుస్తుంది.

ప్రత్యేకంగా ఒటీటీ వెబ్ సిరీస్ సినిమాలని ఫైనల్ చేసే బాద్యతని అల్లు అరవింద్ బాబీకి అప్పగించినట్లుగా టాక్ వినిపిస్తుంది. ఏది ఏమైనా అల్లు బాబీకి గని సినిమాతో నిర్మాతగా రాణించడం ఎంత కష్టం అనేది స్పష్టంగా అర్ధమైంది అనే మాట ఇప్పుడు టాలీవుడ్ సర్కిల్ లో వినిపిస్తుంది. అల్లు అరవింద్ బ్యాక్ అప్ ఉండటంతో ఇప్పుడు హ్యాపీగా సొంత ఒటీటీ చానల్ వ్యవహారాలు చూసుకుంటున్నాడు.నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.