Begin typing your search above and press return to search.

మంచివాడిని ఎవరూ పట్టించుకోవడం లేదా?

By:  Tupaki Desk   |   10 Dec 2019 6:42 AM GMT
మంచివాడిని ఎవరూ పట్టించుకోవడం లేదా?
X
సతీష్ వేగేశ్న దర్శకత్వం లో నందమూరి కళ్యాణ్ రామ్ నటించిన 'ఎంత మంచివాడవురా' సంక్రాంతి సీజన్లో విడుదలకు సిద్ధం అవుతోంది. ఇప్పటికే మహేష్ బాబు -అల్లు అర్జున్ సినిమాల పోటీతో సంక్రాంతి వేడెక్కింది. బడా స్టార్ హీరోలు.. భారీ చిత్రాల నిర్మాతలు కావడంతో థియేటర్లు ఈ రెండు సినిమాల కు ఎక్కువగా ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. దీంతో సంక్రాంతి కి రిలీజ్ కానున్న ఇతర సినిమాల పై ఈ ఎఫెక్ట్ పడుతోందని టాక్.

మహేష్ - అల్లు అర్జున్ సినిమా ల పోటీ వల్ల 'ఎంత మంచివాడవురా' సినిమాకు మహా అయితే మూడు వందల థియేటర్లు దొరకడమే కష్టం అని.. 300 లోపే ఆ నంబర్ ఉంటుదని అంటున్నారు. 300 థియేటర్లు దొరకడమే గగనం అనుకుంటే ఈ సినిమా మరో విషయంలో కూడా జనాల దృష్టిని ఆకర్షించలేకపోతోంది. మహేష్ - బన్నీ సినిమాలు ప్రమోషన్స్ లో ముందంజలో ఉన్నాయి కానీ కళ్యాణ్ రామ్ సినిమా ప్రచారం నీరసం గా ఉంది. కళ్యాణ్ రామ్ సినిమా నుంచి మొన్న ఒక లిరికల్ సాంగ్ విడుదల చేశారు.. అయితే ఆ పాట ఏంటి.. పాట రిలీజ్ అయిన విషయం ఎంత మందికి తెలుసు అనే ప్రశ్నలు వేసుకుంటే కళ్యాణ్ రామ్ సినిమా ప్రమోషన్లు ఎంత వీక్ గా ఉన్నాయో మనకు తెలుస్తుంది. సంక్రాంతి పోటీ లో రిలీజ్ చేస్తున్న ఈ సినిమా కు ప్రమోషన్స్ విషయం లో శ్రద్ధ వహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

ఇదిలా ఉంటే కళ్యాణ్ రామ్ నటించబోయే కొత్త సినిమా సైలెంట్ గా ప్రారంభోత్సవం జరుపుకుంది. సోషియో ఫ్యాంటసీగా తెరకెక్కుతున్న ఈ సినిమాను మొన్నే లాంచ్ చేశారని సమాచారం. ఈ సినిమా భారీ బడ్జెట్ తోనే తెరకెక్కనుందని అంటున్నారు.