Begin typing your search above and press return to search.

భ‌యం కాదు.. బాధ్య‌త పెర‌గాలిః వెంక‌టేష్‌

By:  Tupaki Desk   |   18 May 2021 3:36 PM GMT
భ‌యం కాదు.. బాధ్య‌త పెర‌గాలిః వెంక‌టేష్‌
X
దేశంలో క‌రోనా మ‌హ‌మ్మారి ఏ స్థాయిలో విజృంభిస్తోందో అంద‌రికీ తెలిసిందే. నిత్యం ల‌క్ష‌లాదిగా న‌మోదువుతున్న కేసుల‌తో.. వేలాది న‌మోదువుతున్న మ‌ర‌ణాల‌తో జ‌నం భీతిల్లిపోతున్నారు. ప్రాణాలు అర‌చేతిలో పెట్టుకొని కాలం గ‌డుపుతున్నారు.

ఇలాంటి ప‌రిస్థితుల్లో ప్ర‌జ‌ల‌కు భ‌రోసా ఇచ్చేందుకు ప‌లువురు సెల‌బ్రిటీలు ప్ర‌య‌త్నిస్తున్నారు. ఇప్ప‌టికే ప‌లువురు సినీ ప్ర‌ముఖులు కొవిడ్ జాగ్ర‌త్త‌లు సూచించ‌గా.. తాజాగా ప్ర‌ముఖ న‌టుడు వెంక‌టేష్ ప‌లు సూచ‌న‌లు చేశారు. క‌రోనా బారినుంచి దేశాన్ని ర‌క్షించుకోవాల‌ని అన్నారు. ఈ మేర‌కు ఓ వీడియో విడుద‌ల చేశారు.

''మనం అందరం మన దేశానికి మనం సేవ చేసే టైం వచ్చింది. మనం ఏమీ చేయ‌లేమ‌ని అనుకోవ‌ద్దు. రోజురోజుకూ భ‌యం కాదు.. బాధ్య‌త పెర‌గాలి. అంద‌రూ ఒక‌రికి ఒక‌రు దూరంగా ఉంటూ.. ఇంట్లోంచి బ‌య‌ట‌కు వెళ్ల‌కుండా ఉండాలి. క‌రోనా వైర‌స్ నుంచి మ‌న దేశాన్ని మ‌న‌మే ర‌క్షించుకోవాలి.'' అని సూచించారు వెంకటేష్.