టైటిల్ టీజర్: పెళ్లి పిచ్చి పట్టిన రాజు గాడి కథేమి?

Sun Jan 16 2022 17:33:11 GMT+0530 (IST)

Watch Naveen Polishetty brags about his marriage

టాలీవుడ్ యంగ్ సెన్సేషన్ నవీన్ పోలిశెట్టి సెలక్షన్ అన్నివేళలా హాట్ టాపిక్. ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ- జాతి రత్నాలు చిత్రాలతో బ్లాక్ బస్టర్లు అందుకుని హీరోగా దూసుకొచ్చిన  నవీన్ పోలిశెట్టి ఇప్పుడు మరో కామెడీ చిత్రంతో ప్రేక్షకులను అలరించడానికి వస్తున్నాడు. ఈ సినిమా టైటిల్ ను రివీల్ చేస్తూ స్పెషల్ టీజర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. అనగనగా ఒక రాజు అనే టైటిల్ తో రూపొందుతున్న ఈ చిత్రానికి కళ్యాణ్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. టీజర్ లో నవీన్‌ని పెళ్లి పిచ్చి రాజుగా చూపించారు.ఈ దశాబ్దంలో అత్యంత వినోదాత్మకంగా రూపొందనున్న ఈ చిత్రం అతి త్వరలో సెట్స్ పైకి వెళ్లనుంది. ఫార్చూన్ ఫోర్ సినిమాస్ తో కలిసి సితార ఎంటర్ టైన్ మెంట్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంగీత సంచలనం థమన్ ఎస్ సంగీతం అందించారు. టైటిల్ బావుంది. నవీన్ హంగామా అదిరింది. వేలికి ఉంగరాలు నుంచి కాళ్లకు చెప్పుల వరకూ ఏదీ పర్ఫెక్షన్ లేనిదే క్షమించడు. రాజు గాడి పెళ్లా మజాకానా! అన్నట్టే ఉంటుంది వ్యవహారం.

ఈ రచ్చంతా చూస్తుంటే అతడికి ముందే బ్లాక్ బస్టర్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ముఖ్యంగా నవీన్ పోలిశెట్టి ఎనర్జీ లెవల్స్ కామెడీ టైమింగ్ ప్రతిదీ హైలైట్ గా నిలుస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు. క్రేజీ వెడ్డింగ్ ఫన్ ఏంటో తెరపైనే చూడాలి.