Begin typing your search above and press return to search.

సింహం ఇంట‌ర్వ్యూలు ఇవ్వ‌దు! ఇంత‌లోనే ఖాన్ టోన్ మారిందే!!

By:  Tupaki Desk   |   30 Jan 2023 9:36 AM GMT
సింహం ఇంట‌ర్వ్యూలు ఇవ్వ‌దు! ఇంత‌లోనే ఖాన్ టోన్ మారిందే!!
X
షారుఖ్ ఖాన్ చిత్రం 'పఠాన్' ప్రపంచవ్యాప్తంగా చర్చ‌నీయాంశంగా మారింది. ఈ సినిమా విడుదలైన ఐదు రోజుల్లోనే బాక్సాఫీస్ వద్ద 500కోట్ల క్ల‌బ్ లో చేరింద‌ని ట్రేడ్ చెబుతోంది. పఠాన్ వసూళ్ల పరంగా రోజుకో కొత్త రికార్డు సృష్టిస్తోంది. సినిమా విజయం తర్వాత షారుక్ ఖాన్ ట్విట్టర్ లో ఆస్క్ SRK సెషన్ లో పాల్గొన్నాడు. అందులో అతను అభిమానుల ప్రశ్నలకు ఫన్నీగా సమాధానం ఇచ్చాడు.

షారుక్ ఖాన్ ఎందుకు ఇంటర్వ్యూ ఇవ్వలేదు?

ట్విట్టర్‌ సెషన్ లో ఒక నెటిజ‌న్ షారుక్ ఖాన్ ను ఇదే ప్ర‌శ్న అడిగారు. ''పఠాన్ ఎటువంటి దేశీయ ప్రచారం లేకుండా.. విడుదలకు ముందు ఎటువంటి ముఖాముఖి లేకుండా కూడా బాక్సాఫీస్ వద్ద చాలా సందడి చేస్తున్నాడు''.. దీనిపై షారుక్ ఖాన్ స్పందిస్తూ-''సింహాలు ఇంటర్వ్యూలు ఇవ్వ‌కపోతే.. ఈసారి నేను కూడా చేయకూడ‌ద‌ని అనుకున్నాను'' అని ఛ‌మ‌త్క‌రించాడు.

నిజానికి షారూఖ్ ఖాన్ ఈసారి ప్ర‌మోష‌న‌ల్ స్ట్రాటజీని మార్చాడు. ప్ర‌స్తుత ట్రోలింగ్ క‌ల్చ‌ర్ లో నిశ్శ‌బ్ధంగా ఉండ‌డ‌మే మేల‌ని భావించాడు. ఓవైపు ప‌ఠాన్ పై వివాదాలు ముసురుకోవ‌డంతో తాను ఏదో ఒక‌టి మాట్లాడి అన‌వ‌స‌ర గంద‌ర‌గోళం సృష్టించాల‌ని అనుకోలేదు. పైగా ప‌ఠాన్ కి రిలీజ్ ముందు ట్రైల‌ర్ తో వ‌చ్చిన హైప్ అంతా ఇంతా కాదు. దీంతో మ‌రింత‌గా సైలెంట్ అయిపోయాడు. వ్య‌క్తిగ‌తంగా మీడియాతో ఇంట‌రాక్ట్ కాలేదు. రిలీజ్ త‌ర్వాత కూడా అంతే సైలెంట్ గా విజ‌యాన్ని ఆస్వాధిస్తున్నాడు. ఖాన్ కి 'జీరో' డేస్ పోయాయి. ఇప్పుడు హీరో డేస్ వ‌చ్చాయి! అంటూ అభిమానులు బోలెడంత సంద‌డి చేస్తున్నారు. ప‌ఠాన్ ఇంటి ముందు అభిమానులు గుమిగూడి బోలెడంత రచ్చ చేస్తుంటే అభిమానుల‌కు అభివాదం చేయడంలో ఖాన్ ఆనందం వెతుక్కుంటున్నారు.

ప‌ఠాన్ కలెక్షన్ల గురించి షారుఖ్ మాట‌...Ask SRK సెషన్ లో మరొక అభిమాని షారుక్ ఖాన్ ను ప్ర‌శ్నిస్తూ-''సర్ పఠాన్ సినిమా కలెక్షన్ చూసిన తర్వాత మీకు ఎలా అనిపిస్తోంది? అని ప్ర‌శ్నించారు. దీనిపై షారుక్ ఖాన్ స్పందిస్తూ ''బ్రదర్ నంబర్స్ ఫోన్ కే హోతే హై హమ్ తో ఖుషీ గింటే హై'' అని చెప్పాడు.

'రా' ఏజెంట్ క‌హ‌నీ వ‌ర్క‌వుటైంది పఠాన్ లో షారూఖ్‌- దీపిక‌ పదుకొణె - జాన్ అబ్రహం ప్రధాన పాత్రలు పోషించారు. స‌ల్మాన్ ఖాన్ అతిథి పాత్ర‌లో మెరిసాడు. షారుఖ్ ఖాన్ రా ఏజెంట్ పాత్రలో నటించగా అత‌డి కొలీగ్ గా స‌ల్మాన్ ఐదు నిమిషాల పాటు తెర‌పై అల‌రించారు. అదే సమయంలో జాన్ అబ్రహం భార‌త‌దేశానికి వ్య‌తిరేకిగా మారిన ఇండియా మాజీ 'రా' ఏజెంట్ గా (పాక్ క‌ల్న‌ల్ తో వ్యాపారం చేసేవాడిగా) భీక‌ర విల‌న్ గా అద్భుతంగా న‌టించాడు. ఈ సినిమాలో సల్మాన్ ఖాన్ అతిధి పాత్రలో నటించాడు. YRF స్పై యూనివర్స్ నాల్గవ చిత్రమిది. ఇందులో షారుఖ్ ఖాన్ తన నటనతో అభిమానుల హృదయాలను గెలుచుకోవడంలో విజయం సాధించాడు.

500కోట్ల క్ల‌బ్ లోకి వ‌డి వ‌డిగా...షారుక్ ఖాన్ చిత్రం పఠాన్ బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధిస్తోంది. 'పఠాన్' శుక్రవారం 38 కోట్లు వసూలు చేసిందని ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ ట్వీట్ చేశారు. అంతకుముందు ఈ చిత్రం గురువారం రూ.68 కోట్లు వసూలు చేసింది. ఈ విధంగా ఈ సినిమా మూడు రోజుల్లోనే రూ.161 కోట్ల నెట్ వసూలు చేసింది. శ‌ని - ఆదివారాల వ‌సూళ్లు క‌లుపుకుంటే 280కోట్లు పైగా షేర్ వ‌సూల‌వుతుంద‌ని అంచ‌నా. అంటే సుమారు 500 కోట్ల గ్రాస్ వ‌సూళ్ల‌కు చేరువ అవుతోంద‌ని ట్రేడ్ చెబుతోంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.