టాలీవుడ్ పిలిస్తే ఈ బేబ్ రెడీ

Fri Dec 06 2019 20:00:01 GMT+0530 (IST)

Warina Hussain Glamourous Pose

కొత్తొక వింత పాతొక రోత! అందుకే తెలుగు సినీపరిశ్రమ నిరంతరం కొత్త అందాల కోసం వేటాడుతూనే ఉంటుంది. మన యంగ్ డైరెక్టర్స్ .. హీరోలు నిరంతరం ఏదో ఒక కొత్తదనం కోసం తాపత్రయ పడుతుంటారు. ఆ క్రమంలోనే అన్ని మెట్రో నగరాల్లోనూ అందాల నాయికల కోసం జల్లెడ పట్టే పని పెట్టుకుంటారు. కొన్నిసార్లు ఎంత ప్రయత్నించినా తాము అనుకున్న ప్రమాణాల్లో కథానాయికలు దొరకడం కష్టమవుతోంది. ఇక ఐటెమ్ భామల్ని వెతకాలన్నా చాలానే శ్రమించాల్సి ఉంటుంది. అందానికి అందం హొయలు.. సెక్సప్పీల్.. డ్యాన్సింగ్ ట్యాలెంట్ ఇన్ని లేకపోతే ఐటమ్ బ్యూటీని వెతికి పట్టుకోవడం కష్టం.అయితే అలాంటి డైలమా లేకుండా పూరి లాంటి స్టార్ డైరెక్టర్ స్పెషల్ నంబర్ల కోసం యూత్ గుండెల్ని కొల్లగొట్టే రసగుల్లా లాంటి భామల్ని ఎంపిక చేసుకుంటున్నాడు. ముంబై టాప్ మోడల్స్ తో అతడు ఐటెమ్ నంబర్లు చేయించాడు. విదేశీ ముద్దుగుమ్మల్ని బరిలో దించే వేడెక్కించాడు. అయితే ఇతర దర్శకులెవరూ ఆ రేంజులో ఐటమ్ భామల్ని దించిందేమీ లేదు. ఇదిగో ఇక్కడ కనిపిస్తున్న ఈ కొత్త రసగుల్లాకి టాలీవుడ్ లో అలాంటి అవకాశం దక్కుతుందేమో?  ఇంతకీ ఎవరీ అమ్మడు? అంటే..

బాలీవుడ్ లో ఉన్నట్టుండి తళుక్కుమన్న ఈ సోయగం పేరు వారినా హుస్సేన్.  ప్రస్తుతం యూత్ లో హాట్ టాపిక్. మున్నాకి బదనాము హూయీ.. అంటూ దబాంగ్ 3లో అదిరిపోయే స్పెషల్ నంబర్ లో నర్తించింది. ఇటీవలే ఈ పాటను రిలీజ్ చేస్తే సల్మాన్ భాయ్ అభిమానుల్లోకి దూసుకెళ్లిపోయింది. వారినాను లవ్ యాత్రి అనే సినిమాతో బాలీవుడ్ కి పరిచయం చేసింది సల్మాన్ భాయ్ నే. ఇప్పుడు క్రేజీ మూవీలో ఐటమ్ నంబర్ లోనూ తనతో కలిసి స్టెప్పులేసే ఛాన్సిచ్చాడు. అందుకే అందరి కళ్లు ఈ అమ్మడిపైనే. కుర్రాళ్లను గగ్గోలు పెట్టించే హొయలకు ఈ అమ్మడిలో కొదవేమీ లేదు. తాజాగా రిలీజైన ఈ ఫోటోలో యానిమల్ ప్రింటెడ్ లుక్ లో సూదంటు చూపులతో అదరగొట్టింది. చురుక్కు చూపులతో గాలం వేస్తున్న ఆ కళ్లకు బూడిద రంగు లెన్స్ ప్రత్యేక ఆకర్షణగా కనిపిస్తున్నాయి. బ్లాక్ అండ్ గోల్డ్ డిజైనర్ బ్యాక్ గ్రౌండ్ డ్రెస్ లో వారినా అందం పదింతలైందంటే అతిశయోక్తి కాదు. అందుకే ఈ భామ టాలీవుడ్ కి కూడా ఇంపోర్ట్ అవుతుందా? అంటూ సందేహం మొదలైంది. ఇంతకుముందు దబాంగ్ లో మున్నికి బదనాము హూయీ అంటూ నర్తించిన మలైకా అరోరాని పిలిచి గబ్బర్ సింగ్ లో అవకాశం ఇచ్చారు. ఇప్పుడు పవన్ కల్యాణ్ రీఎంట్రీ గురించి చర్చ సాగుతోంది. ఇలాంటి వేళ ఈ కొత్త అందాలకు ఛాన్స్ లేకపోలేదనే విశ్లేషిస్తున్నారు మరి.