Begin typing your search above and press return to search.

OTT పై వార్.. ఎగ్జిబిట‌ర్ల డేరింగ్ డెసిష‌న్!

By:  Tupaki Desk   |   29 Nov 2021 4:17 AM GMT
OTT పై వార్.. ఎగ్జిబిట‌ర్ల డేరింగ్ డెసిష‌న్!
X
క‌రోనా రాక‌తో ఓటీటీ వ్య‌వ‌స్థ ఎంత బ‌లంగా నాటుకుపోయిందో తెలిసిందే. కొత్త సినిమాలు నేరుగా ఓటీటీలోనే రిలీజ్ అవుతున్నాయి. ఒక‌వేళ థియేట‌ర్లో రిలీజ్ అయినా వారం రోజుల్లోనే ఓటీటీల్లో సినిమాలు అందుబాటులోకి వ‌చ్చేస్తుండ‌డం అంతా మార్చేస్తోంది.

క‌రోనా కార‌ణంగా ప్రేక్ష‌కులు కూడా ఓటీటీకి బాగా అల‌వాటుప‌డ్డారు. థియేట‌ర్ల‌కు వెళ్లాల్సిన ప‌ని లేకుండా ఇంట్లోనే కుటుంబ స‌మేతంగా సినిమా చూసే వెసులుబాటు దొరికింది. క‌రోనా పూర్తిగా త‌గ్గిన త‌ర్వాత కూడా ఇదే సీన్ రిపీట్ అయితే థియేట‌ర్లు మూత ప‌డాల్సిందే. ఇప్ప‌టికే సింగిల్ స్క్రీన్ థియేట‌ర్ల ప‌రిస్థితి ఆగ‌మ్య గోచ‌రంగా త‌యారైంది. ఇదే కొన‌సాగితే ప‌రిస్థితి మ‌రింత దారుణంగా ఉంటుంది.

థియేట‌ర్లో సినిమా రిలీజ్ వ్య‌వ‌హారం క‌ష్ట‌త‌రంగా మారింది. ఈ నేప‌థ్యంలో ఓటీటీకి వేగాన్ని త‌గ్గించ‌డానికి ఎగ్జిబిట‌ర్లు..నిర్మాత‌లు సంచ‌న‌ల నిర్ణయం తీసుకునే దిశ‌గా అడుగులు వేస్తున్నారు. సినిమాను ఓటీటీకి ఇవ్వ‌డంపై నిర్మాత‌లు..ఎగ్జిబిట‌ర్లు కొన్ని ఆంక్షలు విధించాల‌ని డిసైడ్ అయ్యారు.

ఈ మేర‌కు రెండు..మూడు రోజుల్లోనే ఓ స‌మావేశం ఏర్పాటు చేస్తున్న‌ట్లు తెలిసింది. చిన్న సినిమాలు నెల రోజుల త‌ర్వాత‌..పెద్ద సినిమాలు నెల‌న్న‌ర త‌ర్వాత ఓటీటీలో రిలీజ్ అయ్యేలా చ‌ర్య‌లు తీసుకునేలా ఓటీటీ సంస్థ‌ల‌తో ఒప్పందాలు చేసుకోవాల‌ని కోర‌నున్నార‌ట‌. ఆ దిశ‌గా అడుగులు వేస్తున్న‌ట్లు స‌మాచారం. ఈ గ్యాప్ లో సినిమా కేవ‌లం థియేట‌ర్లో మాత్ర‌మే ప్ర‌ద‌ర్శింప‌బ‌డాలి.

ఏ ఇత‌ర‌ వేదిక‌పైనా కొత్త సినిమా వేయ‌డానికి వీల్లేదు అన్న నిబంధ‌న‌ల‌తో ముందుకు క‌దులుతున్న‌ట్లు స‌మాచారం. ఒక‌వేళ నిర్మాత‌లు ఎవ‌రైనా నిబంధ‌న‌ల‌ను అతిక్ర‌మిస్తే త‌దుప‌రి ఆ నిర్మాత సినిమాల్ని థియేట‌ర్లో బ్యాన్ చేసేలా నిర్ణ‌యాలు తీసుకునే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తోంది. అయితే ఓటీటీల‌కు బాస‌ట‌గా సురేష్ బాబు స‌హా ప‌లువురు నిర్మాత‌లు త‌మ నిర్ణ‌యాల్ని బ‌హిరంగంగానే చెబుతుండ‌డం ఇక్క‌డ ఆలోచించాల్సిన క‌ణం.

ఇటీవ‌ల ఓ ప్ర‌ముఖ‌ హీరో సినిమా విష‌యంలో ఎగ్జిబిట‌ర్ల నుంచి హెచ్చ‌రిక‌లు జారీ అవ్వ‌డంతో ఆ హీరో రాజీ బేరానికి వ‌చ్చారని ఓటీటీలో రిలీజ్ చేయ‌డం లేద‌ని కూడా గుస‌గుస వినిపించింది. కోలీవుడ్ లోనూ ఎగ్జిబిట‌ర్లు కొంత మంది నిర్మాత‌ల‌కు నేరుగానే హెచ్చ‌రిక‌లు జారీ చేసిన సంగ‌తి తెలిసిందే. అయితే ఓటీటీల వ్య‌వ‌హారంలో దిద్దుబాటు ఎలా సాగ‌నుంది? అన్న‌ది వేచి చూడాలి.