మీ నాన్న వల్ల 'పోకిరి' వదులుకున్నా

Sat Jul 11 2020 16:20:46 GMT+0530 (IST)

Even if the 'Pokiri' gave up because of your dad

బాలీవుడ్ స్టార్స్ పై కంగనా రనౌత్ విమర్శలు ఆరోపణల పర్వం కొనసాగుతూనే ఉంటుంది. నెపొటిజంకు వ్యతిరేకంగా ఆమె చేస్తున్న వ్యాఖ్యలు తారా స్థాయికి చేరాయి. స్టార్ వారసులపై గతంలో సంచలన వ్యాఖ్యలు చేసిన కంగనా తాజాగా పూజా భట్ ను టార్గెట్ చేసి చేస్తున్న వ్యాఖ్యలు చర్చనీయాంశం అవుతున్నాయి. ఇటీవల పూజా భట్ సోషల్ మీడియాలో కంగనాకు కౌంటర్ గా చేసిన పోస్ట్ కు కంగనౌ మరింత సీరియస్ గా కౌంటర్ ఇచ్చింది.ఆమెకు గ్యాంగ్ స్టర్‌తో మొదటి సినిమా ఛాన్స్ ఇచ్చిన మానాన్న మహేష్ భట్ ను పదే పదే విమర్శిస్తుంది అంటూ పూజా భట్ విమర్శలు చేసింది. మొదటి సినిమాకు అవార్డు అందుకున్న సమయంలో మానాన్న మహేష్ భట్ ను స్టేజ్ పై పొగడ్తల వర్షం కురిపించడంతో పాటు హగ్ కూడా చేసుకుంది అంటూ ఒక వీడియోను షేర్ చేసింది. అప్పుడు ప్రశంసలు కురిపించి ఇప్పుడు విమర్శలు చేయడం ఎంత వరకు సబబు అన్నట్లుగా పూజా భట్ సీరియస్ అయ్యింది.

పూజా భట్ వ్యాఖ్యలకు కంగనా కౌంటర్ ఇచ్చింది. మీ నాన్న వల్ల తెలుగులో పోకిరి చిత్రంలో నటించే అవకాశం కోల్పోయాను. గ్యాంగ్ స్టర్ సినిమా చేసినా చేయకున్నా కూడా నేను పోకిరి సినిమాతో పరిచయం అయ్యేదాన్ని అంటూ కంగనా పేర్కొంది. మొత్తానికి వీరిద్దరి మద్య సోషల్ మీడియా వార్ బాలీవుడ్ వర్గాల్లో చర్చనీయాంశం అవుతుంది. కొందరు కంగనాకు మద్దతు పలుకుతుండగా కొందరు మాత్రం పూజా భట్‌కు మద్దతుగా కామెంట్స్ చేస్తున్నారు.