25 కోట్ల లాభాల్లో వాల్తేరు వీరయ్య

Mon Jan 23 2023 21:00:01 GMT+0530 (India Standard Time)

Waltheru Veeraiah in 25 crore profits

మెగాస్టార్ చిరంజీవి హీరోగా బాబీ దర్శకత్వంలో తెరకెక్కిన వాల్తేర్ వీరయ్య సినిమా కమర్షియల్ గా సూపర్ సక్సెస్ అందుకుంది. మెగాస్టార్ కెరియర్ లో చాలా కాలం తర్వాత వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ ఇది కావడం విశేషం. రాజకీయాల నుంచి మళ్ళీ సినిమాలలోకి అడుగుపెట్టిన తర్వాత మెగాస్టార్ చిరంజీవి చేసిన ఐదు సినిమాలలో ఫ్యాన్స్ ని పూర్తి స్థాయిలో సంతృప్తి పరిచిన చిత్రం అంటే ఇదే అని చెప్పాలి.  కమర్షియల్ గా సూపర్ హిట్ కొట్టిన ఈ సినిమా ఏకంగా రెండు వందల కోట్ల కలెక్షన్స్ దిశగా దూసుకుపోతుంది. చిరంజీవి కెరియర్ హైయెస్ట్ గ్రాస్ షేర్ కలెక్ట్ చేసిన చిత్రంగా వాల్తేర్ వీరయ్య నిలవడం విశేషం. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ మూవీ మైత్రీ మూవీ మేకర్స్ వారికి భారీ లాభాలు తెచ్చి పెడుతుంది.

ఇప్పటి వరకు ఈ సినిమా 195.45 కోట్ల గ్రాస్ రాబట్టింది. అందులో 114 కోట్ల షేర్ ఉండటం విశేషం. ఇక రెండు వందల కోట్ల మార్క్ ని అందుకోవడానికి ఐదు కోట్ల దూరంలోనే ఉండటం విశేషం.

ఏపీలో ఈ సినిమా 95.03 కోట్ల షేర్ ని రాబట్టింది. కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియా మొత్తం 7.35 కోట్ల షేర్ ని కలెక్ట్ చేసింది. ఓవర్సీస్ లో 11.75 కోట్లని ఈ మూవీ కలెక్ట్ చేసింది. ఇలా ఇప్పటి వరకు కలెక్ట్ చేసిన లెక్కల ప్రకారం చూసుకుంటే వాల్తేర్ వీరయ్య ఏకంగా 25.13 కోట్ల షేర్ ని రాబట్టింది. 89 కోట్ల బ్రేక్ ఈవెన్ తో ఈ మూవీ సంక్రాంతి బరిలో ప్రేక్షకుల ముందుకి వచ్చింది.

ఇక ఈ బ్రేక్ ఎవెన్ ని మొదటి వారం రోజుల్లోనే అందుకోవడం ద్వారా సక్సెస్ ట్రాక్ ఎక్కింది.

ఇప్పుడు లాభాట బాటలో పరుగులు పెడుతుంది. ఈ సినిమా సూపర్ సక్సెస్ తో ఇకపై తాను చేసేబోయే సినిమాలు అన్ని కూడా మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్ గానే ఉండే విధంగా ప్లాన్ చేస్తానని మెగాస్టార్ చిరంజీవి క్లారిటీ ఇచ్చాడు. ఒక్క సక్సెస్ మెగాస్టార్ చిరంజీవి మైండ్ సెట్ ని పూర్తిగా మార్చేసిందని ఈ మూవీకి వస్తున్న టాక్ తో స్పష్టం అయ్యింది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.