వీరయ్య లీక్స్... మల్టీస్టారర్ సీన్స్ పీక్

Mon Nov 28 2022 06:00:01 GMT+0530 (India Standard Time)

Waltair Veerayya movie Chiranjeevi and ravi teja

మెగాస్టార్ చిరంజీవి వాల్తేరు వీరయ్య సినిమాలో మాస్ మహారాజా రవితేజ కీలకమైన పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నట్లుగా ఇప్పటికే అధికారికంగా క్లారిటీ వచ్చేసింది. వాల్తేరు వీరయ్య సినిమా కు సంబంధించిన రవితేజ లుక్ కి సంబంధించి ఇప్పటి వరకు ఎలాంటి అప్డేట్ అయితే ఇవ్వలేదు.కానీ చిత్ర యూనిట్ సభ్యులు పలు విషయాల గురించి లీక్ లు ఇస్తూనే ఉన్నారు. ఇప్పటికే సినిమాలో రవితేజ పోలీస్ ఆఫీసర్ అంటూ అనధికారికంగా తెలియజేశారు. తాజాగా ఈ సినిమాలో చిరంజీవి మరియు రవితేజ కాంబినేషన్లో వచ్చే కొన్ని సన్నివేశాలు పీక్స్ లో ఉంటాయి అంటూ లీక్ ఇస్తున్నారు.

ముఖ్యంగా ఇంటర్వెల్ కి ముందు వచ్చే సన్నివేశాలు సినిమా కు ప్రధాన ఆకర్షణగా ఉంటాయట. చిరంజీవి మరియు రవితేజ లు ఒకరికొకరు ఛాలెంజ్ చేసుకునే ఆ సన్నివేశాలు తార స్థాయిలో అభిమానులకు వినోదాన్ని పంచుతాయి అంటూ వీరయ్య యూనిట్ సభ్యులు లీక్ ఇస్తున్నారు.

డిసెంబర్ రెండవ లేదా మూడవ వారంలో వాల్తేరు వీరయ్య సినిమాలో రవితేజ ఎలా ఉండబోతున్నాడు క్లారిటీ ఇవ్వబోతున్నారు. అంతే కాకుండా డిసెంబర్ నెలలోనే రవితేజ మరియు చిరంజీవి కలిసి స్టెప్స్ వేసిన పాటను కూడా రిలీజ్ చేసే అవకాశం ఉంది.

వచ్చే ఏడాది జనవరి నెలలో సంక్రాంతి కానుకగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలను స్పీడ్ పెంచబోతున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.