'వాల్తేరు వీరయ్య' లేటెస్ట్ అప్డేట్..?

Wed May 25 2022 19:45:50 GMT+0530 (IST)

Waltair Veerayya Team All Set To Fly Abroad In June

మెగాస్టార్ చిరంజీవి మరియు డైరెక్టర్ బాబీ (కేఎస్ రవీంద్ర) కాంబినేషన్ లో ఓ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. #MEGA154 అనే వర్కింగ్ టైటిల్ తో సెట్స్ మీదకు తీసుకెళ్లిన ఈ చిత్రానికి ''వాల్తేరు వీరయ్య'' అనే టైటిల్ ను ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది.లేటెస్ట్ బజ్ ఏంటంటే.. ఈ సినిమా కొత్త షెడ్యూల్ షూటింగ్ ను మేకర్స్ మలేషియాలో ప్లాన్ చేస్తున్నారు. జూన్ 5 లేదా 6 నుండి చిత్రీకరణ ప్రారంభిస్తారని.. ఈ షెడ్యూల్ మూడు వారాల పాటు సాగుతుందని అంటున్నారు. సెప్టెంబరు ఆఖరులోగా షూటింగ్ మొత్తం ముగించాలని బాబీ ప్లాన్ చేస్తున్నాడని టాక్ వినిపిస్తోంది.

ఇకపోతే 'వాల్తేరు వీరయ్య' టైటిల్ ను అధికారికంగా ప్రకటించడానికి మేకర్స్ రెడీ అవుతున్నారని తెలుస్తోంది. టైటిల్ తో పాటుగా ఓ మైక్రో టీజర్ ను విడుదల చేయనున్నారని.. త్వరలో దీనికి సంబంధించిన అప్డేట్ వస్తుందని నెట్టింట ప్రచారం జరుగుతోంది.

#Mega154 చిత్రాన్ని వైజాగ్ బ్యాక్ డ్రాప్ లో హై వోల్టేజ్ మాస్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందిస్తున్నారు. ఇందులో చిరంజీవి ఒక మత్స్యకారుడిగా కనిపించనున్నారని టాక్. మాస్ మూల విరాట్ అంటూ ఇప్పటికే రిలీజ్ చేయబడిన ఫస్ట్ లుక్ ఫ్యాన్స్ ని విశేషంగా ఆకట్టుకుంది. ఈ సినిమాలో చిరు సరసన శ్రుతి హాసన్ హీరోయిన్ గా నటిస్తోంది.

మాస్ మహారాజా రవితేజ కీలక పాత్రలో కనిపించనున్నారు. కేథరిన్ థ్రెసా - సముద్రఖని మరియు బాబీ సింహా ఇతర పాత్రలు పోషిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ ఎర్నేని - వై రవిశంకర్ భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూరుస్తుండగా.. జీకే మోహన్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.

చిరంజీవి ఇటీవల 'ఆచార్య' సినిమాతో తన కెరీర్ లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ అందుకున్నారు. మెగా తండ్రీకొడుకులు చిరు - చరణ్ కలిసి చేసిన చిత్రం పరాజయం చెందడం ఫ్యాన్స్ ను నిరుత్సాహ పరిచింది. రాబోయే సినిమాలతో స్ట్రాంగ్ కమ్ బ్యాక్ ఇవ్వాలని కోరుకుంటున్నారు.