Begin typing your search above and press return to search.

వీకెండ్ కూడా వీరయ్య దూకుడు.. 16 రోజుల బాక్సాఫీస్ లెక్క ఇది!

By:  Tupaki Desk   |   29 Jan 2023 3:00 PM GMT
వీకెండ్ కూడా వీరయ్య దూకుడు.. 16 రోజుల బాక్సాఫీస్ లెక్క ఇది!
X
మెగాస్టార్ చిరంజీవి హీరోగా బాబీ దర్శకత్వంలో తెరకెక్కిన వాల్తేరు వీరయ్య సినిమా సంక్రాంతి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి అందరికీ తెలిసిందే. మెగాస్టార్ కెరియర్ లో బ్లాక్ బస్టర్ హిట్ మూవీగా నిలిచిన వాల్తేర్ వీరయ్య కలెక్షన్స్ పరంగా కూడా దుమ్ము దులిపింది. మొదటి రోజే ఏకంగా 22 కోట్ల కలెక్షన్ గ్రాస్ సొంతం చేసుకున్న ఈ సినిమా సంక్రాంతి నాలుగు రోజులు కూడా అదే స్పీడ్ కొనసాగించింది. అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ మాస్ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ సినిమా మరోసారి మెగాస్టార్ మాస్ ఇమేజ్ ని ప్రేక్షకులకు పరిచయం చేసింది.

దీంతో మెగాస్టార్ నుంచి ఈ తరహా కథలు ఇష్టపడేవారు థియేటర్స్ కి క్యూ కట్టారు. ఈ నేపథ్యంలోనే ఐదు రోజుల్లోనే ఏకంగా 100 కోట్ల గ్రాస్ సినిమా సొంతం చేసుకుంది. లాంగ్ రన్ లో ఇప్పటికే 200 కోట్ల మార్క్ అందుకున్న మెగాస్టార్ మేనియా ఎప్పటికీ కూడా డీసెంట్ కలెక్షన్స్ తో దూసుకెళ్తుంది. మెగాస్టార్ టైం అయిపోయింది అని మాట్లాడిన వారందరికీ కూడా వాల్తేర్ వీరయ్య కలెక్షన్స్ సమాధానం చెబుతున్నాయి.

ఇదిలా ఉంటే ఈ సినిమా ఇప్పటికీ 16 రోజులు పూర్తి చేసుకుంది. మూడవ వారంలో కొనసాగుతున్న ఈ సినిమా 16వ రోజు కూడా కోటి ఎనిమిది లక్షల గ్రాస్ కలెక్ట్ చేయడం విశేషం. నిజాం ఏరియాలో మెగాస్టార్ తిరుగులేని రికార్డును క్రియేట్ చేస్తూ ఏకంగా 34.20 కోట్ల షేర్ కలెక్షన్ ని సొంతం చేసుకోవడం విశేషం. ఓవరాల్ గా ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 216 కోట్ల గ్రాస్ ని ఇప్పటివరకు అందుకుంది.

89 కోట్ల బ్రేక్ ఈవెన్ తో రిలీజ్ అయిన వాల్తేర్ వీరయ్య ఇప్పటివరకు ఏకంగా 37.31 కోట్ల ప్రాఫిట్ డిస్ట్రిబ్యూటర్స్ కి తెచ్చిపెట్టింది. ఇక శాటిలైట్, డిజిటల్ రైట్స్ తో కలుపుకుంటే ఈ సినిమాతో నిర్మాత భారీగానే లాభాలు గడించినట్లుగా ఇండస్ట్రీ వర్గాలలో వినిపిస్తుంది. మెగాస్టార్ కి సరైన కమర్షియల్ కథ పడితే ఏ రేంజ్ లో సక్సెస్ వస్తుంది అనేది వాల్తేర్ వీరయ్య సినిమా మరోసారి ప్రూవ్ చేసింది. ఈ నేపథ్యంలో దీనికంటే మరింత ఫన్ అండ్ ఎంటర్టైన్మెంట్ ఉండే విధంగా భోళా శంకర్ సినిమాని మెగాస్టార్ చిరంజీవి ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తుంది.