బాస్ పార్టీ సాంగ్: మేస్త్రికి తగ్గట్టే దేవీ మాస్ ట్యూన్

Thu Nov 24 2022 19:27:52 GMT+0530 (India Standard Time)

Waltair Veerayya Boss Party Lyric Video Megastar Chiranjeevi Urvashi Rautela

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం `వాల్తేరు వీరయ్య`. బాబి దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది. ఈ చిత్రం లో మాస్ మహారాజా రవితేజ- శృతి హాసన్- కేథరిన్ థ్రెస్సా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. సంక్రాంతి కానుకగా విడుదల కానున్న ఈ సినిమా పై భారీ అంచనాలున్నాయి.చాలా ముందే వీరయ్య ప్రచార హంగామా మొదలైంది. ఇప్పటికే మెగాస్టార్ పోస్టర్లు టీజర్.. బాస్ పార్టీ సాంగ్ ప్రోమో అంతర్జాలంలో వైరల్ గా మారాయి. ముఠా మేస్త్రి తరహా టింజ్ ని బాస్ పార్టీ సాంగ్ లోకి తెచ్చారని ప్రోమో వెల్లడించింది. తాజాగా బాస్ పార్టీ పూర్తి లిరికల్ సాంగ్ విడుదలైంది. ఈ పాటలో మెగాస్టార్ ఛమక్కులాంటి స్టెప్పులతో మైమరిపించగా హేట్ స్టోరి4 బ్యూటీ ఊర్వశి రౌతేలా గ్లామర్ కవ్వింపు మరో లెవల్లో మాస్ కి కనెక్టవుతోంది.

దేవీశ్రీ ఎప్పటిలానే తనదైన శైలిలో మాస్ బీట్ ని అందించడంలో సఫలమయ్యాడు. బాస్ లోని గ్రేసుకు తగ్గట్టు ట్యూన్ ని అందించాడు. ఇక ఈ పాటలో మెగాస్టార్ బాడీలాంగ్వేజ్ సంథింగ్ స్పెషల్ గా ఉంటుందని అర్థమైంది. లిరికల్ పాటలో రిపీటెడ్ స్టెప్పులకే మాస్ ఫ్యాన్స్ ఊగిపోతుంటే.. పూర్తి పాటను థియేటర్లలో వీక్షిస్తే పూనకాలే అనడంలో సందేహం లేదు.

ఈ పాటలో ఊర్వశి అందాల ఆరబోత యూత్ ని థియేటర్లకు రప్పిస్తుందనడంలో సందేహం లేదు. గాడ్ ఫాదర్ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత మెగాస్టార్ నటించిన మాస్ సినిమాగా వాల్తేరు వీరయ్యపై భారీ అంచనాలున్నాయి.

ఒక్కో పాటతో మరింతగా అంచనాలు పెంచేస్తూ బాస్ చాలా సందడిగా ప్రమోషన్ చేస్తున్నాడు. సంక్రాంతి పందెంలో పుంజులా రెడీ అవుతున్నాడు. 2023 గొబ్బెమ్మల పండక్కి బాస్ నుంచి అదిరే మాస్ యాక్షన్ ట్రీట్ అందనుందని అర్థమవుతోంది. ఇక ఈ మూవీ నుంచి మాస్ మహారాజా గ్లింప్స్ ని కూడా తొందర్లోనే టీమ్ విడుదల చేయనుందిట.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.