ఓటీటీ రిలీజ్ కోసమే వెయిటింగా.. ఇది మరీ అన్యాయం!

Mon Mar 01 2021 06:00:01 GMT+0530 (IST)

Waiting for the OTT release .. This is a great injustice!

కొనసాగుతున్న మహమ్మారీ క్రైసిస్ ఇప్పటికీ టాలీవుడ్ కి నష్టం కలిగిస్తూనే ఉంది. పూర్తిగా అన్నిచోట్లా మన సినిమాని రిలీజ్ చేసుకోలేని పరిస్థితి ఉంది. ముఖ్యంగా మరో నైజాంలా భావించే అమెరికాలో వందశాతం పరిస్థితి మెరుగవ్వలేదు. అరకొర థియేటర్లను మాత్రమే తెరిచారు అక్కడ. దీంతో ఆ మేరకు మంచి సినిమాల్ని విదేశాల్లో రిలీజ్ చేయలేని పరిస్థితి తలెత్తింది. ఆ మేరకు ఎన్నారైలకు వినోదం క్వాంటిటీ తగ్గిపోయింది.ముఖ్యంగా ఈ సంక్రాంతి బరిలో రిలీజైన సినిమాలను ఓటీటీల్లో మాత్రమే వీక్షించగలిగారు. ఇటీవల వరుసగా రిలీజై విజయం సాధించిన క్రేజీ చిత్రాల్ని అమెరికాలో మన ఎన్నారైలు ఇంకా వీక్షించలేకపోవడానికి కారణం ఓటీటీల్లో లేకపోవడమే. వరుసగా ఓటీటీ విడుదలల కోసమే వారంతా వెయిట్ చేస్తున్నారు.

ఇటీవల విడుదలై సంచలన విజయం సాధించిన ఉప్పెన సహా క్రిటిక్స్ నుంచి ప్రశంసలు అందుకుని బాక్సాఫీస్ వద్దా రాణించిన `నాంది` .. ప్రయోగాత్మకంగా తెరకెక్కి జనాదరణ పొందిన జాంబీ రెడ్డి చిత్రాల్ని ఎన్నారైలు మిస్సయ్యారు. ఈ సినిమాలన్నిటినీ ఓటీటీల్లో చూడాలన్న ఆసక్తి అక్కడ ఉంది.

మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ నటించిన ఉప్పెన నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది. అలాగే అల్లరి నరేష్ నాంది ఆహా-తెలుగులో స్ట్రీమింగ్ కానుంది. జాంబీరెడ్డి OTT విడుదల కోసం చర్చలు ఇంకా కొనసాగుతున్నాయి  ఇక ఇప్పటికే క్రాక్ మూవీ ఆహాలో స్ట్రీమింగ్ అవుతున్న సంగతి తెలిసినదే. రామ్ నటించిన రెడ్ సహా ఇతర సంక్రాంతి రిలీజ్ లు ఇప్పటికే ఓటీటీల్లో అందుబాటులో ఉన్నాయి.