బాలా-సూర్యా.. అసలేమైంది?

Wed May 25 2022 12:00:41 GMT+0530 (IST)

Waht Is Happening Between Bala And Surya

తమిళ చిత్ర పరిశ్రమలో ఒకసారి దర్శకుడి నమ్మితే హీరోలు ప్రాణం పెట్టి నటించడానికి ఎంతగానో కృషి చేస్తారు. అక్కడ దర్శకులకు హీరోలకు ఇచ్చే గౌరవం చాలా ప్రత్యేకంగా ఉంటుంది అనే చెప్పాలి. ఒకప్పుడు సక్సెస్ అందుకని ఇప్పుడు ప్లాప్ అయిన వారికి కూడా హీరోలు అవకాశాలు ఇవ్వడానికి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. ఇక సూర్య కూడా అదే తరహాలో ఒకప్పటి కల్ట్ డైరెక్టర్ బాలా తో కూడా అలానే సినిమా చేయాలని అనుకున్నాడు.నటుడిగా నిలదొక్కుకునేందుకు అడుగులు వేస్తున్న సమయంలో సూర్య బాలాతో సినిమా చేయాలని ఎంతగానో ప్రయత్నం చేశాడు. ఇక వీరి కలయికలో వచ్చిన మొదటి సినిమా నంద మంచి విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే.

తర్వాత శివ పుత్రుడు సినిమా లో ఒక స్పెషల్ క్యారెక్టర్ లో కనిపించిన సూర్య నటుడిగా తన స్థాయిని పెంచుకున్నాడు. ఆ విధంగా బాలా సూర్య కెరియర్ కు ఒక మంచి బూస్ట్ అయితే ఇచ్చాడు. కానీ బాలా మాత్రం మెల్లగా తన ఫామ్ కోల్పోతూ వచ్చాడు. ఇటీవల కాలంలో ఆయన ఎలాంటి సినిమాలు చేసిన బాక్సాఫీస్ వద్ద దారుణంగా దెబ్బ కొడుతున్నాయి.

ఆ మధ్య కాలంలో వచ్చిన వాడు వీడు సినిమా తప్పితే అనంతరం వచ్చిన సినిమాలన్నీ కూడా దెబ్బ కొట్టాయి. ముఖ్యంగా విక్రమ్ కొడుకు ధ్రువ్ తో చేసిన అర్జున్ రెడ్డి రీమేక్ క్యాన్సిల్ అయిన విషయం తెలిసిందే.

షూటింగ్ మొత్తం పూర్తి అయిన తర్వాత నిర్మాత ఆ సినిమాను డస్ట్ బిన్ లో పడేయడం ఆశ్చర్యాన్ని కలిగించింది. ఇక ఆ తర్వాత కూడా సూర్య ఈ డైరెక్టర్ కు మంచి అవకాశం ఇవ్వాలి అని అనుకున్నాడు. సొంత బ్యానర్ 2D ఎంటర్టైన్మెంట్స్ లోనే ఈ సినిమాను కూడా నిర్మించాలని ప్లాన్ చేశాడు.

అయితే క్రియేటివ్ డిఫరెన్స్ కారణాల వలన స్క్రిప్ట్ కూడా సరిగా సెట్ కాకపోవడం వలన ఆ ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయినట్లు ఒక టాక్ అయితే వచ్చింది. ఇక రీసెంట్ గా 2D ఎంటర్టైన్మెంట్స్ లో దర్శకుడు బాలా ఇంకా స్క్రిప్టు మెరుగుపరచడానికి సమయం తీసుకున్నట్లుగా క్లారిటీ అయితే వచ్చింది.  ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయినట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదు అని హీరో సూర్య కూడా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు అని అంటున్నారు. మరి ఈ ప్రాజెక్ట్ అనుకున్నట్లుగా తెరకెక్కుతోంది లేదో చూడాలి.