టీజర్ టాక్ : ఓటర్ కాదు ఓనర్

Thu Mar 14 2019 17:12:53 GMT+0530 (IST)

Voter Teaser

గత కొంత కాలంగా సక్సెస్ లేక ఇబ్బంది పడుతున్న మంచు విష్ణు సరిగ్గా ఎన్నికల వేళ సరైన సబ్జెక్టుతో వస్తున్నాడు. సినిమా పేరు ఓటర్. గత కొంత కాలంగా నిర్మాణంలో ఉన్న ఓటర్ ఇప్పుడు విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా టీజర్ ని రిలీజ్ చేసింది టీం. హీరో సామజిక స్పృహ కలిగిన యువకుడు. అహింసతో స్వతంత్రం తెచ్చుకున్న దేశంలో పేదరికం మాత్రం ఇంకా అలాగే ఉండటం పట్ల కలత చెందుతూ ఉంటాడు.దానికి పరిష్కారం రాజకీయ నాయకులను మార్చడం ఒక్కటే కనిపిస్తుంది. దాంతో ఆ వ్యవస్థకు తిరగబడతాడు. సవాళ్ళు విసురుతాడు. తాను ఎదురుబోయేది చాలా ప్రమాదమని తెలిసి ముందుకు వెళ్తాడు. మరి ఈ ఓటర్ అనుకున్న లక్ష్యాన్ని చేధించాడా లేదా అనేదే అసలు కథ

టీజర్ నిమిషం లోపే ఉంది కాబట్టి ఎక్కువ అంచనాలకు వచ్చే అవకాశం ఇవ్వకుండా సింపుల్ గా కట్ చేశారు. దీని పరంగా చూస్తే జస్ట్ ఓకే అనిపించేలా ఉంది. విష్ణుకి ఇటీవల వచ్చిన గత చిత్రాల కన్నా ఓ సోషల్ మెసేజ్ తో ఇందులో ఏదో ప్రయత్నించినట్టే కనిపిస్తోంది. విష్ణు సంపత్ మధ్య ఛాలెంజ్ చేసుకునే సన్నివేశం ఓ రెండు యాక్షన్ బ్లాక్స్ తప్ప ఇంకేమి రివీల్ చేయలేదు. నేను ఓటర్ కాదు ఓనర్ అంటూ చెప్పిన విష్ణు రీ సౌండింగ్ డైలాగ్ ఫ్యాన్స్ కోసమే.

తమన్ సంగీతం బ్యాక్ గ్రౌండ్ లో బాగానే సింక్ అయ్యింది. జిఎస్ కార్తీక్ దర్శకత్వం వహించిన ఓటర్ ని ఈ ఎన్నికల సీజన్ లోనే విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. మరి ఏదో ఒక పార్టీని విజయ లక్ష్మి వరించబోతున్నట్టే విష్ణుని కూడా ఈ ఓటర్ కరుణిస్తాడెమో చూడాలి.