60 ఏళ్ల హీరోలు 20/30 ఏళ్ల హీరోయిన్స్.. దర్శకుడి షాకింగ్ కామెంట్స్

Tue Aug 16 2022 12:00:01 GMT+0530 (IST)

Vivek Ranjan Shocking Comments

హిందీ.. తెలుగు.. తమిళం... ఇలా ఏ ఇండియన్ భాషా సినిమా ఇండస్ట్రీని చూసినా కూడా సీనియర్ హీరోలు వారి కూతురు లేదా కొడుకు వయసు ఉన్న హీరోయిన్స్ తో రొమాన్స్ చేస్తున్నారు. ఇక్కడ అక్కడ అనే తేడా లేకుండా ప్రతి చోట ఇది ఉంది. ప్రస్తుతం బాలీవుడ్ లో స్టార్ హీరోలకు జోడీగా పాతిక నుండి ముప్పై ఏళ్ల వయసు హీరోయిన్స్ నటించడం కామన్ విషయం అయ్యింది.బాలీవుడ్ లోని పరిస్థితి పై దర్శకుడు వివేక్ రంజన్ అగ్నిహోత్రి ఘాటుగా స్పందించాడు. ఈయన దర్శకత్వంలో వచ్చిన కాశ్మీర్ ఫైల్స్ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఆ సినిమా తర్వాత వివేక్ రెగ్యులర్ గా వార్తల్లో ఉంటూనే ఉన్నాడు.

ఆయన ఏం మాట్లాడినా కూడా అది మీడియా లో పతాక స్థాయిలో నిలవడం... ఆయన ప్రతి విషయంలో కూడా కాస్త ఘాటుగా మాట్లాడటం చేస్తుండటం వల్ల వివాదాలు ఏర్పడటం జరుగుతుంది.

తాజాగా హీరోలు 60 ఏళ్ల వయసులో 20/30 ఏళ్ల హీరోయిన్స్ తో రొమాన్స్ చేసేందుకు సిద్ధం అవ్వడం అనేది బాలీవుడ్ నాశనం కు దారి తీస్తుంది అంటూ తీవ్ర స్థాయిలో స్పందించాడు.

వయసు మీద పడిన హీరోలు కూడా ముహానికి మేకప్ వేసుకుని హీరోయిన్స్ పక్కన యంగ్ గా కనిపించేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు అంటూ ఆయన పేర్కొన్నారు.

సినిమా ల్లో తాము యంగ్ గా కూల్ గా కనిపించడం కోసం చాలానే ప్రయత్నాలు చేస్తున్నారు. అలాంటి ప్రయత్నాలు సినిమాలో కొత్తదనం ఉండేందుకు మాత్రం జరగడం లేదు అనేది వివేక్ ఆరోపన. ఆయన చేసిన వ్యాఖ్యల్లో నిజం లేకపోలేదు. కాని కమర్షియల్ సినిమాలను ఇష్టపడుతున్న ప్రేక్షకుల కోసం సీనియర్ హీరోలు అలాంటివి చేయక తప్పడం లేదు అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.