Begin typing your search above and press return to search.

బాలయ్య సినిమాలో వివేక్‌.. ట్రోల్స్‌ మళ్లీ షురూ

By:  Tupaki Desk   |   13 Aug 2020 1:30 AM GMT
బాలయ్య సినిమాలో వివేక్‌.. ట్రోల్స్‌ మళ్లీ షురూ
X
రామ్‌ చరణ్‌ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చిన చిత్రం ‘వినయ విధేయ రామ’. చరణ్‌ కెరీర్‌ లో ఆ సినిమా మరీ డిజాస్టర్‌ గా నిలిచింది. ముఖ్యంగా ఆ సినిమాలోని యాక్షన్‌ సన్నివేశాలు ఏ స్థాయిలో ట్రోల్‌ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. చరణ్‌ కాని బోయపాటి కాని గతంలో ఏ సినిమాకు ఆ స్థాయిలో ట్రోల్స్‌ చవి చూసి ఉండరు. బోయపాటి యాక్షన్‌ సన్నివేశాలు హాలీవుడ్‌ కు తీసుకు వెళ్లాలంటూ కొందరు తర్వాత సినిమాలో బోయపాటి యాక్షన్‌ సీన్స్‌ అంతరిక్షంలో ఉంటాయేమో అంటూ మరికొందరు ఇలా రకరకాలుగా ట్రోల్స్‌ చేశారు.

వినయ విధేయ రామ చిత్రంలో విలన్‌ గా నటించిన వివేక్‌ ఒబేరాయ్‌ నెట్టింట ఏ స్థాయిలో వైరల్‌ అయ్యాడో చెప్పనక్కర్లేదు. ఆయన పాత్రను మరీ అతిగా చూపించాడంటూ విమర్శలు వ్యక్తం అయ్యాయి. వివేక్‌ ఒబేరాయ్‌ బాబోయ్‌ ఇలాంటి సినిమాను నేను చేశానా అని బాధపడి ఉంటాడు అంటూ నెటిజన్స్‌ కామెంట్స్‌ చేశారు. అంతగా వివేక్‌ ఒబేరాయ్‌ పాత్రను ప్రేక్షకులు తిరష్కరించారు. ఆ సినిమా దెబ్బకు బోయపాటి అంటే వివేక్‌ ఒబేరాయ్‌ బాబోయ్‌ అంటూ ఉంటాడని అనుకున్నారు. కాని బాలయ్య సినిమాకు విలన్‌ గా వివేక్‌ ఒబేరాయ్‌ ను బోయపాటి తీసుకోబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.

బాలయ్య బోయపాటి కాంబోలో గతంలో వచ్చిన రెండు సినిమాలు సూపర్‌ హిట్స్‌. ఆ కారణంగానే ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకేల ఉన్నాయి. బోయపాటి కూడా ఈసారి చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఈ సినిమాను చేస్తున్నాడు. అందుకే వివేక్‌ ఒబేరాయ్‌ ని మరోసారి ఈ చిత్రంలో విలన్‌ గా చూపించాలని బోయపాటి భావిస్తున్నాడట. దాంతో నెట్టింట మళ్లీ ట్రోల్స్‌ షురూ అయ్యాయి. వివేక్‌ ఒబేరాయ్‌ మరియు బాలయ్య ఫొటోలతో నెట్టింట మీమ్స్‌ పుట్టుకు వస్తున్నాయి. అయితే బిబి3 చిత్రంలో వివేక్‌ ఒబేరాయ్‌ పాత్రపై ఇంకా అధికారిక క్లారిటీ అయితే రాలేదు. అధికారికంగా వస్తే మరెంతగా ట్రోల్స్‌ స్టార్ట్‌ అవుతాయో..!