పిక్ టాక్: 'నెల్లూరు ప్రభ' మీదకెక్కి కూర్చున్న కమెడియన్ సత్య..!

Fri May 07 2021 13:00:01 GMT+0530 (IST)

Vivaha Bhojanambu Latest Pic Goes Viral

టాలీవుడ్ స్టార్ కమెడియన్ సత్య ని హీరోగా పరిచయం చేస్తూ యువ హీరో సందీప్ కిషన్ నిర్మిస్తున్న సినిమా ''వివాహ భోజనంబు''. లాక్ డౌన్ లో జరిగిన కొన్ని యదార్థ సంఘటనల ఆధారంగా దర్శకుడు రామ్ అబ్బరాజు ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. అర్జావీ రాజ్ హీరోయిన్ గా నటిస్తుండగా.. నెల్లూరు ప్రభ అనే ప్రత్యేక పాత్రలో సందీప్ కిషన్ కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు - టీజర్ మంచి స్పందన తెచ్చుకున్నాయి. ఈ క్రమంలో నేడు సందీప్ బర్త్ డే సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తూ కొత్త పోస్టర్ రిలీజ్ చేశారు.ఈ పోస్టర్ లో హాస్య నటుడు సత్య ఇందులో నెల్లూరు ప్రభ పాత్ర పోషిస్తున్న సందీప్ కిషన్ మీదకెక్కి కూర్చున్నాడు. ఇద్దరూ నవ్వుతూ ఉన్న ఈ ఫోటో ప్రేక్షకులను అలరిస్తోంది. ఇకపోతే కరోనా లాక్ డౌన్ పుణ్యమా అని కొద్ది మందితో సింపుల్ గా పెళ్లి చేసుకుందామని ప్లాన్ చేసుకున్న పిసినారి మహేష్ (సత్య).. లాక్ డౌన్ పొడిగించడంతో వాళ్ళందరిని పోషించడానికి ఎలాంటి కష్టాలు పడ్డాడనేది 'వివాహ భోజనంబు' చిత్రంలో ఫన్నీగా చూపించబోతున్నారు.

వెంకటాద్రి టాకీస్ సమర్పణలో ఆనంది ఆర్ట్స్ - సోల్జర్స్ ఫ్యాక్టరీ బ్యానర్స్ పై కె.ఎస్. శినీష్ - సందీప్ కిషన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో సుదర్శన్ - శ్రీకాంత్ అయ్యంగార్ - టి.ఎన్.ఆర్ - ‘వైవా’ హర్ష - మధుమని - నిత్య శ్రీ - కిరీటి ఇతర పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి భాను భోగవరపు స్టోరీ అందించగా.. నందు ఆర్.కె మాటలు రాశారు. అనివీ సంగీతం సమకూర్చారు. మణికందన్ సినిమాటోగ్రఫీ అందించగా.. చోటా కె. ప్రసాద్ ఎడిటింగ్ వర్క్ చేస్తున్నారు.