Begin typing your search above and press return to search.

నలుగురు హీరోయిన్లతో రొమాన్స్.. విశ్వక్ సేన్ న్యూ మూవీ!

By:  Tupaki Desk   |   4 Jun 2021 4:30 AM GMT
నలుగురు హీరోయిన్లతో రొమాన్స్.. విశ్వక్ సేన్ న్యూ మూవీ!
X
తెలుగు ఇండస్ట్రీలో యువహీరోల హవా మాములుగా లేదు. అలా దూసుకుపోతున్న యువహీరోలలో విశ్వక్ సేన్ ఒకరు. వెళ్ళిపోమాకే సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైన విశ్వక్.. 'ఈ నగరానికి ఏమైంది' సినిమాతో ఇండస్ట్రీలో హీరోగా ఫస్ట్ సక్సెస్ అందుకున్నాడు. ఆ తర్వాత సొంతంగా డైరెక్షన్ చేసి 'ఫలక్ నుమా దాస్' సినిమాను రూపొందించాడు. ఆ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర హిట్ అవ్వడంతో యూత్ లో ఈ హీరోకు మంచి క్రేజ్ క్రియేట్ అయింది. పక్కా హైదరాబాద్ యాసలో తీసిన ఫలక్ నుమా దాస్ సినిమాతో తనని తను నిరూపించుకున్న విశ్వక్.. ప్రస్తుతం వరుసగా సినిమాలు ప్రకటిస్తున్నాడు.

విశ్వక్ చివరిగా కొత్త డైరెక్టర్ శైలేంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన 'హిట్' సినిమాతో వచ్చాడు. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద హిట్ అవ్వడంతో విశ్వక్ తదుపరి సినిమాల సంఖ్య పెరిగిపోయింది. అందుకే ఇప్పుడు చేతిలో తెలుగు సినిమాలతో పాటు రీమేక్ సినిమాలు కూడా ఉన్నాయి. ప్రస్తుతం విశ్వక్.. నరేష్ అనే నూతన దర్శకుడితో పాగల్ అనే సినిమా చేస్తున్నాడు. రొమాంటిక్ లవ్ స్టోరీ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ మూవీ త్వరలో రిలీజ్ అయ్యేందుకు సిద్ధం అవుతోంది. అయితే తాజా సమాచారం ప్రకారం.. విశ్వక్ కప్పేలా అనే మలయాళం రీమేక్ తో పాటు 'ఓ మై కడవులే' అనే తమిళ మూవీ రీమేక్ కూడా చేస్తున్నాడు.

ఇదిలా ఉండగా.. విశ్వక్ గుట్టుచప్పుడు కాకుండా స్టార్ డైరెక్టర్ తో ఓ హారర్ థ్రిల్లర్ మూవీ లైన్ లో పెట్టేసాడు. ఆ సినిమా కూడా సెకండ్ వేవ్ లాక్డౌన్ ముందే 90% షూటింగ్ కంప్లీట్ అయినట్లు సమాచారం. ఆశ్చర్యం అనిపిస్తున్నా నమ్మకతప్పదు. ఈ యంగ్ హీరో 'అక్టోబర్ 31 - లేడీస్ నైట్' అనే ద్విభాషా చిత్రంలో నటిస్తున్నాడు. హారర్ నేపథ్యంలో ఫస్ట్ హలోవీన్ మూవీగా ఇది రాబోతుంది. అయితే ఈ సినిమాను 'తలైవి' ఫేమ్ డైరెక్టర్ ఏఎల్ విజయ్ తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాలో విశ్వక్ సరసన ఏకంగా నలుగురు కుర్రహీరోయిన్స్ రొమాన్స్ చేయనున్నారు. మేఘాఆకాష్ - మంజిమమోహన్ - రెబ్బా మౌనిక జాన్ - నివేదా పేతురాజ్ హీరోయిన్స్ కాగా.. ఈ సినిమాను త్రిపుర ఫేమ్ ఎం. రాజశేఖర్ నిర్మిస్తున్నారు. లాక్డౌన్ కారణంగా ఈ సినిమాను సీక్రెట్ గా ఉంచినట్లు ఇండస్ట్రీవర్గాలు చెబుతున్నాయి. చూడాలి మరి విశ్వక్ సేన్ తమిళ డెబ్యూ ఎలా జరగబోతుందో..!