లేటెస్ట్ ఫోటో : స్టైలిష్ లుక్ లో మాస్ కా దాస్...!

Sun Sep 20 2020 20:30:23 GMT+0530 (IST)

Vishwak Sen Stylish Look

సినిమాలతో పాటు రియల్ లైఫ్ లో తన యాటిట్యూడ్ తో గుర్తింపు తెచ్చుకున్న హీరో విశ్వక్ సేన్. 'పిట్టకథ' అనే షార్ట్ ఫిలింలో యాక్ట్ చేసిన విశ్వక్.. 'వెళ్ళిపోమాకే' సినిమాతో హీరోగా ఇంట్రడ్యూస్ అయ్యాడు. ఆ తర్వాత 'ఈ నగరానికి ఏమైంది' 'ఫలక్ నుమా దాస్' చిత్రాలతో యూత్ ఆడియన్స్ కి బాగా దగ్గరయ్యాడు. ఈ క్రమంలో నేచురల్ స్టార్ నాని ప్రొడక్షన్ లో 'హిట్' అనే సినిమాలో నటించాడు. ఈ మిస్టరీ థ్రిల్లర్ ద్వారా యాక్టర్ గా మరో మెట్టు ఎక్కాడు విశ్వక్ సేన్. అయితే ఫస్ట్ సినిమా నుంచి ప్రతి సినిమాలో అదే యాటిట్యూడ్ తో ఒకే స్టైల్ ఫాలో అవుతూ వస్తున్నాడని.. యువ హీరోలందరూ ఎప్పటికప్పుడు స్టైల్ లో చేంజెస్ చూపిస్తూ ఉంటే.. విశ్వక్ మాత్రం హెయిర్ స్టైల్ కూడా మార్చడం లేదని కామెంట్స్ వినిపిస్తుంటాయి. ఈ నేపథ్యంలో అలా కామెంట్స్ చేసే వారందరూ షాక్ అయ్యే లుక్ తో దర్శనమిచ్చాడు మాస్ కా దాస్.విశ్వక్ సేన్ ప్రస్తుతం నటిస్తున్న 'పాగల్' సినిమా కోసం తన లుక్ మార్చేసినట్లు తెలుస్తోంది. లేటెస్టుగా 'పాగల్' లో విశ్వక్ సేన్ స్టిల్స్ బయటకు వచ్చాయి. దీంట్లో విశ్వక్ ట్రెండీ అవుట్ ఫైట్స్ తో స్టైలిష్ గా కనిపిస్తున్నాడు. ఎప్పుడూ లేని విధంగా హెయిర్ స్టైల్ చేంజ్ చేసి స్మార్ట్ గా తయారయ్యాడు. అంతేకాకుండా నోట్లో బీడీ పెట్టుకొని మాస్ కా దాస్ అనిపిస్తున్నాడు. కాగా 'పాగల్' చిత్రంతో నరేష్ కొప్పల్లి అనే కొత్త డైరెక్టర్ ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నాడు. ఈ చిత్రాన్ని లక్కీ మీడియా బ్యానర్ లో బెక్కం వేణుగోపాల్ నిర్మిస్తున్నారు. విశ్వక్ సేన్ 'హిట్' కు ఫోటోగ్రఫీ అందించిన మణికందన్ ఈ సినిమాకు పని చేస్తుండగా.. 'గూఢచారి' గ్యారీ సర్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. 'అర్జున్ రెడ్డి' రథన్ మ్యూజిక్ అందిస్తున్నాడు.