Begin typing your search above and press return to search.

రౌడీపిల్ల‌లో ఈ క‌ళ కూడానా?

By:  Tupaki Desk   |   2 April 2019 1:30 AM GMT
రౌడీపిల్ల‌లో ఈ క‌ళ కూడానా?
X
రౌడీ పిల్ల‌గా సాయి ప‌ల్ల‌వి ఇమేజ్ గురించి తెలిసిందే. ప్రేమమ్‌ - ఫిదా చిత్రాల‌తో టాలీవుడ్ లో పాపుల‌ర్ స్టార్ గా ఎదిగింది. త‌మిళంలోనూ క‌ణం - మారి 2 చిత్రాల‌తో పాపులారిటీ తెచ్చుకుంది. అక్క‌డ‌ తొలి రెండు సినిమాలు స‌క్సెస్ కాక‌పోయినా సాయి ప‌ల్ల‌వి న‌ట‌న‌కు మాత్రం పేరొచ్చింది. మారి 2లో ధ‌నుష్ తో క‌లిసి రౌడీ బేబి పాట‌కు సాయి ప‌ల్ల‌వి వేసిన స్టెప్పులు అంత‌ర్జాలంలో వైర‌ల్ అయ్యాయి. ఆ వీడియో సాంగ్ ఇప్ప‌టికీ యూట్యూబ్ లో అమితాద‌ర‌ణ పొందుతోంది. కోట్లాది మంది వీక్ష‌కులు సాయి ప‌ల్ల‌వి డ్యాన్సులు - ఎన‌ర్జీకి వీరాభిమానులు అయిపోయారు.

అయితే సాయి ప‌ల్ల‌వి పొరుగు ప‌రిశ్ర‌మ‌కు వెళ్లిపోవ‌డం మాతృభాష‌లో అభిమానుల‌కు రుచించ‌లేదు. ప్రేమ‌మ్ త‌ర్వాత తెలుగులో బిజీ అయిపోయింది. అటుపై త‌మిళంలోనూ బిజీ అయిపోవ‌డం మ‌ల‌యాళీల‌కు ఏమాత్రం రుచించ‌లేదు. ఒక ట్యాలెంటెడ్ స్టార్ మాతృప‌రిశ్ర‌మ‌ను వ‌దిలి వెళ్లిపోయింద‌ని అలిగిన వీరాభిమానులు ఉన్నారు. అలాంటి వాళ్ల కోసం ప్ర‌స్తుతం సాయి ప‌ల్ల‌వి మ‌ల‌యాళంలో ఓ సినిమా చేస్తోంది. అథిర‌న్ అనేది సినిమా టైటిల్. విషు - ఫ‌హ‌ద్ ఫాజిల్ క‌థానాయ‌కులుగా న‌టిస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి సాయి ప‌ల్ల‌వి లుక్ ఒక‌టి రిలీజైంది. ఈ ఫోటోల్లో సాయి ప‌ల్ల‌వి న‌వ‌వ‌ధువు గెట‌ప్ లో అద‌ర‌గొట్టేసింది. ఈ ఫోటోలు చూశాక సాయి ప‌ల్ల‌విని తిరిగి ఇంత క‌న్నుల పండుగగా చూడ‌డం ఆనందాన్నిచ్చింద‌ని మ‌ల్లూ అభిమానులు చెబుతున్నారు.

ప్రేమ‌మ్ సినిమాతో మ‌ల‌యాళ తెర‌కు ప‌రిచ‌య‌మైన ఈ ముద్దుగుమ్మ దుల్కార్‌ స‌ల్మాన్ - నివిన్ పాళీ లాంటి స్టార్ల స‌ర‌స‌న నటించింది. ప్ర‌స్తుతం న‌వ‌త‌రం హీరోల‌తోనూ న‌టించేందుకు గ్రీన్ సిగ్న‌ల్ ఇస్తోందిట‌. అధిర‌న్ త‌ర్వాత మ‌ళయాలంలో కెరీర్ సాగించే ఆలోచ‌న‌లో ఈ అమ్మ‌డు ఉంద‌ని తెలుస్తోంది. అయితే తెలుగు - త‌మిళంలోనూ ఈ బ్యూటీ బిజీ బిజీ. త‌మిళంలో ప్ర‌స్తుతం సూర్య స‌ర‌స‌న ఎన్జీకే చిత్రంలో న‌టించింది. త్వ‌ర‌లోనే ఈ చిత్రం రిలీజ్ కి రెడీ అవుతోంది.