సూపర్ హిట్ కాంబో.. పీరియాడిక్ భారీ ప్రాజెక్ట్

Fri Sep 30 2022 22:00:01 GMT+0530 (India Standard Time)

Vishnu Vardhan to Direct a  Film with Ajith

తమిళ స్టార్ హీరో అజిత్ వరుస సినిమాలతో బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తూనే ఉన్నారు. ఏడాదికి ఒక్కటి అన్నట్లుగా తగ్గకుండా సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తూనే ఉన్నాడు.ప్రస్తుతం అజిత్ హెచ్ వినోద్ దర్శకత్వంలో వరుసగా మూడవ సినిమాను చేస్తున్నాడు. ప్రస్తుతం వినోద్ దర్శకత్వంలో తునివు సినిమా చేస్తున్న అజిత్ ఆ తర్వాత విష్ణు వర్ధన్ దర్శకత్వంలో చిత్రం చేయబోతున్నాడు.

టాలీవుడ్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో ఎవర్ గ్రీన్ స్టైలిష్ మూవీ పంజా ను తెరకెక్కించి పవన్ ను కొత్తగా చూపించిన దర్శకుడు విష్ణు వర్ధన్ ఆ సినిమా తో సక్సెస్ ను దక్కించుకోలేక పోయాడు.

అయినా కూడా ఆ సినిమా విష్ణు వర్ధన్ కి మంచి పేరును తెచ్చి పెట్టింది. ఇప్పుడు అజిత్ తో పంజా విష్ణు వర్థన్ ఒక భారీ పీరియాడిక్ సినిమాను చేసేందుకు సిద్ధం అవుతున్నాడు.

గతంలోనే అజిత్ మరియు విష్ణు వర్థన్ కాంబినేషన్ లో సినిమాలు వచ్చిన విషయం తెల్సిందే. ఆ సినిమాలు మంచి విజయాలను కూడా దక్కించుకున్నాయి. అందుకే ఇప్పుడు వీరిద్దరి కాంబోలో రాబోతున్న సినిమా పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉంటాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు.

ప్రముఖ తమిళ నిర్మాణ సంస్థ ఈ సినిమా ను వందల కోట్ల బడ్జెట్ తో నిర్మించేందుకు సిద్ధం అయ్యిందట. ఇప్పటి వరకు అజిత్ కెరీర్ లో చేయని పాత్ర.. అలాగే చేయని నేపథ్యంలో ఈ సినిమా రూపొందబోతుంది అంటున్నారు. అజిత్ కి ఉన్న క్రేజ్ మరియు విష్ణు వర్థన్ పై ఉన్న నమ్మకం తో సినిమా పై భారీ అంచనాలు నమోదు అవ్వబోతున్నాయి.నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.