చీరలో గుబులు రేపిన టీవీ యాంకర్ కం నటి

Tue May 11 2021 17:00:01 GMT+0530 (IST)

 Vishnu Priya Latest Stunning Pose

నేటితరం మెచ్చే టెలివిజన్ షోస్ తో పాపులరైన హాట్ యాంకరమ్మగా విష్ణు ప్రియ పేరు పాపులరైంది. `పోరా పోవే` షోతో బాగా పాపులరైన ఈ తెలుగమ్మాయి కొన్ని చిన్నా చితకా సినిమాల్లోనూ నటించింది. యూత్ లో ఎక్కువ ఫాలోయింగ్ ఉన్న యాంకరమ్మగా గుర్తింపు తెచ్చుకుంది.ఎప్పటికప్పుడు సోషల్ మీడియాల్లో వరుస ఫోటోషూట్లతో హీటెక్కిస్తూనే ఉంది. పొట్టి నిక్కర్లు... డిజైనర్ దుస్తుల్లో అందాల్ని ఎలివేట్ చేస్తూ క్రేజ్ పెంచుకునే ప్రయత్నాలు బాగానే చేస్తోంది. అయితే బుల్లి తెర నుంచి వెండి తెరకు వెంటనే ప్రమోట్ కాలేకపోతుంది.

తాజాగా విష్ణు ప్రియ చీరలో కవ్వించే ప్రయత్నం చేసింది. మెరుపులు మిరుమిట్ల చీరను ధరించి కిల్లర్ లుక్ తో కనిపిస్తున్న ఫోటోలు సోషల్ మీడియాల్లో వైరల్ గా మారాయి. స్కై బ్లూ కలర్ షిమ్మరీ చీరలో అందాల విందు చేస్తోంది. చీరలో ఫ్యాషన్ ప్రియుల్ని సైతం ఆకట్టుకుంది. నెటిజనులు తమదైన శైలిలో కామెంట్లు చేస్తూ అమ్మడి క్రేజ్ ని పెంచే ప్రయత్నం చేస్తున్నారు.

ప్రస్తుతం ఈ భామ తెలుగులో `చెక్ మేట్` అనే సినిమాలో నటిస్తోంది. కొంత భాగం షూటింగ్ పూర్తయింది. కొవిడ్ కారణంగా సినిమాకు సంబంధించిన పనులు నిలిచిపోయాయి.