తెలుగమ్మాయ్ గుండెలు తీసిన బంటు!

Sun Dec 05 2021 11:00:01 GMT+0530 (IST)

Vishnu Priya Latest Photos

టెలివిజన్ షోస్ లో హాట్ యాంకరమ్మగా పాపులరైన విష్ణు ప్రియ భీమనేని వరుస ఫోటోషూట్లు హీట్ పెంచుతున్న సంగతి తెలిసిందే. బుల్లి తెర నుంచి వెండితెర ప్రమోషన్ కోసం ఆరాటపడుతున్న ఈ బ్యూటీ `పోరా పోవే` షోతో బాగా పాపులరైన సంగతి తెలిసిందే. ప్రియా కొన్ని చిన్నా చితకా సినిమాల్లో సైతం నటించింది. యూత్ లో ఎక్కువ ఫాలోయింగ్ ఉన్న యాంకర్ గా ఇటీవల ఈ భామ కూడా క్రేజీగా దూసుకుపోతుంది. ఎప్పటికప్పుడు సోషల్ మీడియా అభిమానుల్ని అందాల వడ్డనలతో హీటెక్కిస్తూనే ఉంది. పొట్టి నిక్కర్లు...డిజైనర్ లుక్స్ తో క్రేజ్ పెంచుకునే ప్రయత్నాలు చేస్తోంది. అయితే బుల్లి తెర నుంచి వెండి తెరకు ప్రమోట్ మాత్రం కాలేకపోతుంది. నటిగా ఆడపా దడపా సినిమాలు చేసినా ఆమెకు అంతగా గుర్తింపు రాలేదు.అయినా పట్టు వదలని విక్రమార్కుని సోదరిలా తన ప్రయత్నం ఆపలేదు. తాజాగా విష్ణు ప్రియ స్కై బ్లూ కలర్  గౌనులో అందాలు వడ్డించింది. ఈ గౌనులో మత్తెక్కించే అందాలు హాట్ టాపిక్ గా మారాయి. క్లోజ్ అప్ షాట్ లో ఈ బ్యూటీ మరింత ఆకర్షణీయంగా కనిపిస్తోంది. ప్రస్తుతం ఈ ఫోటో చూపరులను ఆకట్టుకుంటోంది. యువతలో చర్చగాను మారింది. ఇక నెటిజనులు తమదైన శైలిలో కామెంట్లు గుప్పిస్తూ విష్ణు ప్రియను అనుసరిస్తున్నారు. వారెవ్వా విష్ణు ప్రియ! అంటూ కొందరు ఫిదా అయిపోతున్నారు. కొందరైతే గుండెలు తీసిన బంటు.. అంటూ తన లుక్ పై వ్యాఖ్యానిస్తున్నారు.

ప్రస్తుతం ఈ భామ తెలుగులో `చెక్ మేట్` అనే సినిమాలో నటిస్తోంది. కొంత భాగం షూటింగ్ పూర్తయింది. కొవిడ్ కారణంగా సినిమాకు సంబంధించిన పనులు నిలిచిపోయాయి. కోవిడ్ తర్వాత తిరిగి చాలా సినిమాల షూటింగ్ లు ప్రారంభమయ్యాయి. కానీ చెక్ మేట్ మాత్రం ఇంకా అక్కడే ఉన్నట్లు కనిపిస్తోంది. అయితే క్రైసిస్ లో ఏదీ వీలుపడడం లేదు. నిర్మాతలకు ఉన్న డబ్బు అంతా ఖర్చయింది. ఆ రకంగా చాలా సినిమాలు మధ్యలోనే వదిలేసారు. మరి `చెక్ మేట్` పరిస్థితి ఏంటి? అన్నది మేకర్స్ రివీల్ చేస్తేగాని తెలియదు.