Begin typing your search above and press return to search.

పార్క్ హ‌య‌త్ లో విష్ణు డిన్న‌ర్ పార్టీ దుమారం

By:  Tupaki Desk   |   14 Sep 2021 8:30 AM GMT
పార్క్ హ‌య‌త్ లో విష్ణు డిన్న‌ర్ పార్టీ దుమారం
X
మావీ ఆర్టిస్ట్స్ అసోసియేష‌న్ (మా) ఎన్నిక‌ల నేప‌థ్యంలో స‌న్నివేశం ర‌స‌వ‌త్త‌రంగా మారుతున్న సంగ‌తి తెలిసిందే. ఓట‌ర్ల‌ను ఆక‌ర్షించుకునే ప్ర‌క్రియ‌లో భాగంగా ఎవ‌రికి వారు స‌మావేశాలు నిర్వ‌హిస్తున్నారు. లంచ్ పార్టీలు.. డిన్న‌ర్ పార్టీలు.. మందు పార్టీలు అంటూ మెంబ‌ర్ల ను పార్టీల‌తో ముంచేస్తున్నారు. ప్ర‌ధానంగా పోటీ ప్ర‌కాష్ రాజ్- మంచు విష్ణు ప్యాన‌ల్ మ‌ధ్య నెల‌కొన‌డంతో ఏ వ‌ర్గానికి ఆ వ‌ర్గం మెంబ‌ర్ల‌ను ఆక‌ర్షించుకునే ప‌నిలో బిజీ అయ్యారు. ఇప్ప‌టికే ప్ర‌కాష్ రాజ్ జేఆర్ సీ క‌న్వెన్ష‌న్ లో మెంబ‌ర్లంద‌రికీ శ‌నివారం గ్రాండ్ గా లంచ్ పార్టీ ఇచ్చారు. ఆ సంద‌ర్భంగా స‌భ్యులంద‌రితో ఇంట‌రాక్ట్ అయ్యారు.

దాదాపు 100 మంది వ‌ర‌కూ ఈ విందుకు హాజ‌రైన‌ట్లు తెలుస్తోంది. లంచ్ అనంత‌రం `మా` సంక్షేమాల‌పై చ‌ర్చించి.. ఎలా ముందుకు తీసుకెళ్లాలి? అన్నదానిపైనా ప్ర‌ధానంగా చ‌ర్చ జ‌రిగింది. 10 కోట్ల కార్ప‌స్ ఫండ్ ఏర్పాటు చేస్తాన‌ని విల‌క్ష‌ణ న‌టుడు హామీ కూడా ఇచ్చారు. ఈ నేప‌థ్యంలో మంచు విష్ణు కూడా స్పీడ్ పెంచిన‌ట్లు క‌నిపిస్తోంది. తాజాగా విష్ణు కూడా మంగ‌ళ‌వారం పార్క్ హ‌య‌త్ లో మెంబ‌ర్ల‌కు డిన్న‌ర్ పార్టీ ఏర్పాటు చేసారు. హ‌య‌త్ వేదిక‌గా విష్ణు కూడా మంత‌నాలు మొద‌లున‌ట్టిన‌ట్లు తెలుస్తోంది. ఈ రోజంతా మెంబ‌ర్లు ఆ హ‌డావుడిలోనే పార్క్ హ‌య‌త్ లో బిజీగా గ‌డ‌ప‌నున్నారు.

ఉద‌యం నుంచి రాత్రి 10 గంట‌ల‌ వ‌రకూ చ‌ర్చించ‌డానికి ఎక్కువ ఆస్కారం ఉంది కాబ‌ట్టి విష్ణు ఇలా లాక్ చేసిన‌ట్లు తెలుస్తోంది. ఇప్ప‌టికే ప్ర‌కాష్ రాజ్ సూచ‌న ప్రాయంగా త‌న ఎజెండాను ప్ర‌క‌టించిన నేప‌థ్యంలో మంచు విష్ణు కూడా నేటి భేటీలో కీల‌క నిర్ణ‌యాలు తీసుకునే అవ‌కాశం క‌నిపిస్తోంది. ఇటీవ‌లే `మా ` భ‌వ‌నం సొంత ఖ‌ర్చుతో నిర్మిస్తాన‌ని విష్ణు హామీ ఇచ్చారు. ఈ నేప‌థ్యంలో అసోసియేష‌న్ సంక్షేమం కోసం త‌న మ్యానిఫేస్టోని కూడా రిలీజ్ చేసే అవ‌కాశం ఉంది. అక్టోబ‌ర్ 10న ఎన్నిక‌లు నిర్వ‌హించ‌డానికి ఈసీ నోటిఫికేష‌న్ రిలీజ్ చేసిన సంగ‌తి తెలిసిందే.

ప్ర‌కాష్ రాజ్ కి బ‌ల‌మైన పోటీ..!

`మా` ఎన్నిక‌ల వేళ‌ విందు రాజ‌కీయాలు వేడెక్కిస్తున్నాయి. లంచ్ లు డిన్న‌ర్ లు అంటూ ఓట‌ర్ల‌ను ఆక‌ర్షిస్తున్నారు. పార్టీల‌తో ఒక‌టే హడావుడి. అక్టోబ‌ర్ 10న మూవీ ఆర్టిస్టుల (మా) ఎన్నిక‌ల డే వ‌ర‌కూ ఇదే ప‌రిస్థితి ఉంటుంది.

ఇంత‌కుముందే న‌రేష్ లంచ్ పార్టీలు ఆ త‌ర‌వాత బ‌రిలో దిగి ప్ర‌కాష్ రాజ్ ఆక‌స్మిక పార్టీ గురించి తెలిసిన‌దే. మొన్న‌టికి మొన్న‌ మ‌రోసారి ప్ర‌కాష్ రాజ్ విందు రాజ‌కీయం ప్ర‌ముఖంగా చ‌ర్చ‌కు వ‌చ్చింది. ``కలిసి మాట్లాడుకుందాం.. మన లక్ష్యాలపై చర్చించుకుందాం.. సహపంక్తి భోజనం చేద్దాం`` అంటూ ఆయ‌న పార్టీ ఇచ్చారు. ఈ పార్టీలో ప్ర‌కాష్ రాజ్ తెలివిగా అసంతృప్తుల్ని బుజ్జ‌గించారు. మ‌రోవైపు మంచు విష్ణు కూడా త‌న వ‌ర్గాన్ని సంతుష్టుల‌ను చేసేందుకు సైలెంట్ గా మంత్రాంగం నడిపిస్తున్నార‌ని క‌థ‌నాలొచ్చాయి. మంచు విష్ణుకు వీకే న‌రేష్ వ‌ర్గం నుంచి మ‌ద్ధ‌తు ఉంది. వీరంద‌రితో క‌లిసి విష్ణు వార్ కి రెడీ అవుతున్నారు. ప్ర‌కాష్ రాజ్ పై గెలుపే ధ్యేయంగా విందు రాజ‌కీయాలు న‌డిపిస్తున్నార‌ని క‌థ‌నాలొస్తున్నాయి. అక్టోబ‌ర్ 10 న మా ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌కాష్ రాజ్ .. మంచు విష్ణు అధ్య‌క్ష స్థానానికి పోటీపడుతుండ‌గా.. బండ్ల గ‌ణేష్ వ‌ర్సెస్ జీవిత ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ప‌ద‌వికి పోటీప‌డుతున్నారు. బాబూ మోహ‌న్ ఇటీవ‌ల మా ఎన్నిక‌ల రేస్ లో చేరారు.