Begin typing your search above and press return to search.

విశాల్ లాఠీ ఛార్జ్.. జెట్ స్పీడ్ లోనే..

By:  Tupaki Desk   |   3 July 2022 8:30 AM GMT
విశాల్ లాఠీ ఛార్జ్.. జెట్ స్పీడ్ లోనే..
X
ప్రముఖ తమిళనాడు విశాల్ ఒకవైపు సినిమాలతో బిజీగా ఉంటూనే మరొకవైపు కోలీవుడ్ చిత్ర పరిశ్రమలో నిత్యం కొనసాగుతున్న వివాదాల్లో హాట్ టాపిక్ గా మారుతూనే ఉన్నాడు. నిర్మాతల మండలి వ్యవహారంలో చాలా బిజీగా కనిపించే విశాల్ పలు సామాజిక అంశాలపై కూడా నిత్యం స్పందిస్తూనే ఉంటాడు. ఇక ప్రస్తుతం అతని ఫోకస్ మొత్తం కూడా లాఠీ ఛార్జ్ అనే సినిమా పైనే ఉంది.

గత కొంతకాలంగా వరుస డిజాస్టర్స్ ను ఎదుర్కొంటున్న విశాల్ తెలుగులో కూడా పెద్దగా సక్సెస్ చూసింది లేదు. ఒకప్పుడు అయితే విశాల్ ఎలాంటి సినిమా చేసినా కూడా తమిళంలో ఎలాగైతే రిలీజ్ చేసేవాడో తెలుగులో కూడా అదే తరహాలో భారీగానే విడుదల చేసుకుంటూ వచ్చాడు. తెలుగులో కూడా అతనికి కొంత మార్కెట్ అయితే ఏర్పడింది. కానీ రొటీన్ కమర్షియల్ సినిమాలు ఎక్కువ కావడంతో ప్రేక్షకులు అతన్ని పెద్దగా పట్టించుకోవడం మానేశారు.

గత ఐదేళ్ళ కాలంలో చూసుకుంటే విశాల్ ఎలాంటి సినిమా చేసినా కూడా బాక్సాఫీస్ వద్ద దారుణంగా డిజాస్టర్ అవుతున్నాయి. కనీసం పెట్టిన పెట్టుబడిలో సగం కూడా వెనక్కి రావడం లేదు. విశాల్ పలు ఆర్థిక నష్టాల్లో కూడా కూరుకుపోయినట్లుగా కోలీవుడ్ ఇండస్ట్రీలో అయితే కథనాలు వెలబడుతున్నాయి. ఇక ప్రస్తుతం అతను వినోద్ దర్శకత్వంలో చేస్తున్న లాఠీ ఛార్జ్ అనే సినిమాపై ఎక్కువగా ఫోకస్ చేస్తున్నాడు.

ఈ సినిమాతో ఎలాగైనా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి సక్సెస్ అందుకోవాలని చూస్తున్నాడు. ఇక ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన యాక్షన్ సన్నివేశాలు పీటర్ హెయిన్స్ ఆధ్వర్యంలో రూపొందుతున్నాయి. చిత్ర యూనిట్ సభ్యులతో రీసెంట్గా దిగిన ఒక ఫోటో కూడా వైరల్ గా మారుతుంది. వీలైనంత త్వరగా ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసి ఇదే ఏడాది సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని విశాల్ ఆలోచిస్తున్నాడు. అలాగే తెలుగులో కూడా అతను ఒక ప్రముఖ దర్శకుడితో సినిమా చేసేందుకు చర్చలు జరుపుతున్నట్లు సమాచారం.