Begin typing your search above and press return to search.

'ఎనిమీ'లుగా రాబోతున్న యంగ్‌ హీరోలు

By:  Tupaki Desk   |   25 Nov 2020 8:50 AM GMT
ఎనిమీలుగా రాబోతున్న యంగ్‌ హీరోలు
X
తమిళ యంగ్‌ స్టార్‌ హీరోలు విశాల్‌ మరియు ఆర్యలు కలిసి ఒక మల్టీస్టారర్‌ సినిమాను చేస్తున్నారు. ఆనంద్‌ శంకర్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మల్టీ స్టారర్‌ కు ఎనిమీ అనే టైటిల్‌ ను ఖరారు చేసినట్లుగా తమిళ మీడియా వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ హైదరాబాద్‌ లోని ప్రముఖ ఫిల్మ్‌ స్టూడియోలో జరుపుకుంటుంది. ఈ చిత్రంలో హీరోయిన్‌ గా మృణాళిని రవి నటిస్తుంది. ఈ మల్టీ స్టారర్‌ సినిమాపై తమిళ ఆడియన్స్ తో పాటు తెలుగు ప్రేక్షకుల్లో కూడా అంచనాలు భారీగా ఉన్నాయి.

గతంలో వీరిద్దరు కలిసి బాల దర్శకత్వంలో 'అవన్‌ ఇవన్‌' అనే సినిమాను చేశారు. తమిళంతో పాటు తెలుగులో కూడా ఆ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. కనుక ఇప్పుడు వీరి కాంబోలో రూపొందుతున్న మరో మల్టీస్టారర్‌ సినిమా అవ్వడంతో అంచనాలు భారీగా ఉన్నాయి. ఎనిమీ అంటూ సినిమా టైటిల్‌ ను ఖరారు చేయడంతో ఈ సినిమాలో ఒకరికి ఒకరు ఎనిమీలుగా కనిపించబోతున్నారా అంటూ అనుమానం వ్యక్తం అవుతుంది.

ఇద్దరు కూడా హీరోలుగా నటిస్తూనే ఒకరు అంటే ఒకరు కోపంతో ఉంటారేమో అని కొందరు ఊహిస్తున్నాఉ. మొత్తానికి 'ఎనిమీ' టైటిల్‌ తో సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. మరి సినిమా ఎలా ఉంటుందో చూడాలి. తెలుగులో ఈ సినిమాను అదే టైటిల్‌ తో విడుదల చేసే అవకాశం ఉంది.