ఫస్ట్ లుక్: ఉద్యమమా..నక్సలిజమా ఏది నీ వృత్తి?

Fri Dec 13 2019 22:52:30 GMT+0530 (IST)

Virata Parvam First Look

బాహుబలి చిత్రంతో యంగ్ హీరో రానా క్రేజు స్కైని టచ్ చేసిన సంగతి తెలిసిందే. భళ్లాల దేవ పాత్రకు అతడు తప్ప ఇంకెవరకూ సూట్ కారేమో అన్నంతగా నటించి మెప్పించాడు. ప్రస్తుతం వరుసగా పలు క్రేజీ చిత్రాల్లో నటిస్తున్నాడు. పాన్ ఇండియా కేటగిరీ హీరోగా కొత్త ప్రణాళికలతో దూసుకుపోతున్నాడు. ఈ శనివారం రానా 35వ పుట్టిన రోజు జరుపుకుంటున్నారు.ఈ సందర్భంగా `విరాటపర్వం` టీమ్ రానా గెటప్ ఫస్ట్‌లుక్ ను రిలీజ్ చేసింది. చురుకైన చూపులతో ఉద్యమ వీరుడి లక్షణం ఈ గెటప్ లో కనిపిస్తోంది. ముఖానికి రెడ్ ష్కార్ఫ్ కట్టుకుని కనిపిస్తున్న రానా లుక్ టెర్రిఫిక్. టైటిల్ కి తగ్గట్టే రానా ఫస్ట్ లుక్ ఎంతో ఇంటెన్స్ తో కనిపిస్తోంది. దీంతో పాటు సినిమా థీమ్ ఏంటో ఫస్ట్ లుక్ పోస్టర్ లోనే అర్థమయ్యేలా చూపించడం ఆసక్తికరం. ప్రేమ .. రొమాన్స్.. వీటన్నిటినీ మించి సంఘర్షణ.. ఉద్యమం.. బతుకు పోరాటం నేపథ్యంలో ఈ సినిమా వుండబోతోందనే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఈ గెటప్ ని బట్టి రానా నక్సలైట్ గా నటిస్తున్నాడు అంటూ అభిమానులు అంచనా వేస్తున్నారు. దీనిపై ఇప్పటికే బోలెడంత ప్రచారం సాగింది.

గత కొంత కాలంగా వ్యక్తిగాత కారణాల వల్ల అమెరికాలో వుండిపోయిన రానా ఈ మధ్యనే ఇండియా వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటి వరకు దర్శకుడు విరాట పర్వం కథకు సంబంధించిన కీలక సన్నివేశాల్ని సాయి పల్లవి పైనే చిత్రీకరించారు.  ఇప్పటికే సాయి పల్లవిపై రెండు కీలక షెడ్యూళ్లని పూర్తిచేశారు.

ఇటీవలే రానా `విరాటపర్వం` సెట్ లో జాయిన్ అయ్యారు. శుక్రవారం నుంచి దర్శకుడు వేణు ఊడుగుల రానాకు సంబంధించిన కీలక ఘట్టాల్ని హైదరాబాద్ లోని రామోజీ ఫిల్మ్ సిటీలో చిత్రీకరిస్తున్నారని తెలిసింది. బాలీవుడ్ నటి నందితా దాస్ మానవ హక్కుల నేతగా కనిపించబోతున్నారు. రానా కెరీర్ లో ఈ చిత్రం మరో మైలు రాయి కావాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఈ సినిమాతో పాటు నేటి బర్త్ డే బోయ్ రానా తదుపరి భారీ చిత్రాలకు సంబంధించిన వివరాల్ని వెల్లడిస్తాడేమో చూడాలి. హాథీ మేరా సాథీ- హిరణ్‌య కసిప చిత్రాల్ని పాన్ ఇండియా కేటగిరీలో ప్లాన్ చేసిన రానా.. వాటికి సంబంధించిన అప్ డేట్స్ ని మరింత వివరంగా అందిస్తారేమో చూడాలి.