Begin typing your search above and press return to search.

కూతురు వామికతో విరాట్ దంపతులు.. ఫోటోస్ వైరల్!

By:  Tupaki Desk   |   21 April 2021 2:30 AM GMT
కూతురు వామికతో విరాట్ దంపతులు.. ఫోటోస్ వైరల్!
X
స్టార్ సెలబ్రిటీ కపుల్ అనుష్కశర్మ, విరాట్ కోహ్లీ ముంబైలో మీడియా కంటపడ్డారు. ఈ జంట తమ కుమార్తె వామికాతో ముంబై విమానాశ్రయంలో కనిపించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ స్టార్ కపుల్ తాజాగా చెన్నై నుండి ముంబైకి తిరిగి వచ్చారు. ఇటీవలే విరాట్ జట్టు బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ కోల్‌కతా నైట్ రైడర్స్‌తో మ్యాచ్ కారణంగా అక్కడికి వెళ్లడం జరిగింది. అనుష్క వామికాను బేబీ స్లింగ్‌లో మోసుకెళ్ళి కట్టేసుకుంది. మరోవైపు విరాట్ లగేజ్ తీసుకెళ్తూ కనిపించాడు. ముంబై విమానాశ్రయంలో వారి కుమార్తె వామికాతో విరాట్ అనుష్కలు ఎంతో హ్యాపీగా కనిపించారు.

అనుష్క తన హెయిర్ ను పోనీటైల్ లో కట్టి వైట్ షర్ట్, బ్లూ జీన్స్ ధరించింది. మరోవైపు విరాట్ బ్లాక్ అండ్ రెడ్ పోలో టీ-షర్టు, టోపీ, ఫేస్ షీల్డ్‌లో స్టైలిష్ గా దర్శనమిచ్చాడు. వామిక బేబీతో ఈ జంట కొత్త ఫోటోలను వీడియోలను అభిమానులు లైక్స్ షేర్స్ తో వైరల్ చేస్తున్నారు. ఇదివరకు కూడా విరాట్ అనుష్క అహ్మదాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో కెమెరా కంటపడ్డారు. ఇదిలా ఉండగా.. అనుష్క పాప పుట్టిన తర్వాత ఇటీవలే ఫస్ట్ షూట్ లో పాల్గొంది. షూటింగ్ కు వచ్చే రెండు నెలల ముందే అనుష్క యాడ్ షూట్ లో పాల్గొంది. ఈ దంపతులు ఈ ఏడాది జనవరి నెలలో కూతురు వామికకు స్వాగతం పలికారు. కూతురు పుట్టకముందే అనుష్క మే నెలలో షూటింగ్ కు వస్తానని చెప్పింది. విరాట్, అనుష్క డిసెంబర్ 11, 2017లో పెళ్లి చేసుకున్నారు. ప్రస్తుతం ఈ కపుల్ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.