Begin typing your search above and press return to search.

పెళ్లికి ముందే స‌తీమ‌ణికి విరాట్ అదిరే గిప్ట్

By:  Tupaki Desk   |   16 Jun 2021 12:47 PM GMT
పెళ్లికి ముందే స‌తీమ‌ణికి విరాట్ అదిరే గిప్ట్
X
విరాట్ కొహ్లీ- అనుష్క శ‌ర్మ జంట వైవాహిక జీవితంలో స‌ర‌దాలు సంతోషాలు సోష‌ల్ మీడియాల్లో ఎప్ప‌టిక‌ప్పుడు రివీల్ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. త‌మ దాంప‌త్య జీవితంలో మ‌ధుర ఘ‌ట్టాల‌ను అనుష్క శర్మ అభిమానుల‌కు షేర్ చేస్తారు. ఇద్ద‌రి ప్రేమ‌కి కానుగా జ‌న‌వ‌రిలో ఓ బేబి కూడా జ‌న్మించిన సంగ‌తి తెలిసిందే. బేబి వామికా ఆ ఇద్ద‌రికీ చాలా స్పెష‌ల్. ప్ర‌స్తుతం ఆ జంట ప్ర‌పంచం వామికానే.

ఎప్ప‌టికప్పుడు సోష‌ల్ మీడియాలో ఆ మ‌ధురానుభూతుల‌ను పంచుకుంటుంటారు. తాజాగా విరుష్క గురించి ఓ ఆస‌క్తిక‌ర వీడియో లీకైంది. ఈ జంట పెళ్లి స‌మ‌యంలో విరాట్ త‌న‌ ప్రియురాలి కోసం ఏకంగా గొంతునే స‌వ‌రించిన‌ట్లు తెలుస్తోంది. అనుష్క కోసం మేరే మెహ‌బూబ్ ఖ‌యామత్ హోగీ అనే ఓ బాలీవుడ్ పాట‌ను అద్భుతంగా పాడాడు. ఈ వీడియో లో విరాట్ ఆల‌పిస్తుండ‌గా కుటుంబ స‌భ్యులు, స్నేహితులు ఆస్వాధిస్తున్నారు. విరాట్ పాట‌ను మెచ్చి అంతా చ‌ప్ప‌ట్లు కొడుతున్నారు.

ఈ పాట‌ను విరాట్ భార్య‌కు అంకితమిచ్చాడు. దీంతో అనుష్క ఎంతో భావోద్వేగానికి గురైంది. ప్ర‌స్తుతం అనుష్క సినిమాల‌కు గ్యాప్ ఇచ్చి కుటుంబానికే ఎక్కు స‌మ‌యం కేటాయిస్తోంది. మ‌రోవైపు విరాట్ టెస్ట్ ఛాంపియ‌న్ షిప్ కోసం స‌న్న‌ద్ధమ‌వుతున్నాడు.