వైరల్: లాయర్ సాబ్ ఫ్యాన్ మేడ్ పోస్టర్

Mon Jan 20 2020 17:53:42 GMT+0530 (IST)

Viral: Lawyer Saab Fan Made Poster

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ త్వరలో రీ ఎంట్రీ ఇవ్వనున్న సంగతి తెలిసిందే.  దిల్ రాజు బ్యానర్లో బాలీవుడ్ సూపర్ హిట్ ఫిలిం 'పింక్' రీమేక్ లో పవన్ నటిస్తారని ఇప్పటికే వార్తలు వచ్చాయి. ఈ సినిమాకు బోనీ కపూర్ సహా నిర్మాతగా వ్యవహరిస్తారు. ఈ సినిమాను దర్శకుడు వేణు శ్రీరామ్.  దిల్ రాజు కూడా ఈ సినిమా గురించి ప్రకటించారు కానీ పవన్ కళ్యాణ్ వైపు నుంచి మాత్రం ఈ సినిమాలో నటిస్తున్నట్టుగా ఎలాంటి ధృవీకరణ రాలేదు.పింక్ సినిమాలో అమితాబ్ బచ్చన్ పోషించిన లాయర్ పాత్రను ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ పోషిస్తున్నారని సమాచారం.  ఈ సినిమాకు 'లాయర్ సాబ్' అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారని కూడా జోరుగా ప్రచారం సాగుతోంది.  ఇదిలా ఉంటే తాజాగా 'లాయర్ సాబ్' టైటిల్ తో ఒక ఫస్ట్ లుక్ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.  దిల్ రాజు ప్రొడక్షన్ హౌస్ నుంచి ఈ పోస్టర్ రాలేదు కాబట్టి ఇది ఫ్యాన్ మేడ్ పోస్టర్ అయి ఉండొచ్చు.  ఈ పోస్టర్ ను ప్రముఖ ఫిలిం క్రిటిక్ కత్తి మహేష్ తన సోషల్ మీడియా ఖాతా ద్వారా షేర్ చేసి.. ఎప్పటి లాగే పవన్ పై వెటకారంగా పవన్ కళ్యాణ్ అనే నాయకుడు స్త్రీల హక్కుల కోసం వాదించే 'లాయర్ సాబ్' గా నటించడం ఏదైతే ఉందో.." అంటూ పోస్ట్ పెట్టారు.  దీంతో ఈ పోస్టర్ మరింతగా వైరల్ అయింది.

పవన్ కళ్యాణ్ ఒక సినిమాలో నటిస్తున్నారంటే ఆ క్రేజ్ వేరు.  సినిమా ప్రకటన నుంచి రిలీజ్ వరకూ హంగామా పీక్స్ లో ఉంటుంది.  పవన్ కొంతకాలం గ్యాప్ తర్వాత రీ ఎంట్రీ ఇస్తున్నారు కాబట్టి ఆ హంగామా ఈసారి ఇంకా ఎక్కువగా ఉండడం ఖాయమే.