Begin typing your search above and press return to search.

ద‌స‌రా లాంచ్: `మ‌నం` కాంబో `థాంక్యూ` డీసెంట్ స్టార్ట్

By:  Tupaki Desk   |   25 Oct 2020 5:30 PM GMT
ద‌స‌రా లాంచ్: `మ‌నం` కాంబో `థాంక్యూ` డీసెంట్ స్టార్ట్
X
యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య- విక్రమ్ కుమార్ కాంబినేష‌న్ మూవీపై చాలా కాలంగా గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. మనం తర్వాత రెండోసారి ఈ జోడీ క‌లిసి ప‌ని చేస్తున్నార‌ని ఇటీవ‌ల క‌థ‌నాలు వెలువ‌డ్డాయి. ఎట్ట‌కేల‌కు విజ‌య‌ద‌శ‌మి రోజున ఈ కాంబో మూవీ అధికారికంగా పూజా కార్య‌క్ర‌మాల‌తో ప్రారంభ‌మైంది.

ఈ సినిమా టైటిల్ థాంక్యూ. విక్రమ్ కుమార్ స్టైల్ ఎంటర్ టైనర్ ఇద‌ని తెలుస్తోంది. థాంక్యూ ఈ రోజు హైదరాబాద్ లో లాంఛనంగా ప్రారంభ‌మైంది. డిసెంబరు నుంచి సెట్స్ కి వెళతారు. 2021 లో విడుదల అవుతుంది.

లెజెండరీ సినిమాటోగ్రాఫర్ పి.సి. శ్రీరామ్ సినిమాటోగ్ర‌ఫీ అందించ‌నున్నారు. బీవీఎస్ రవి కథ అందిస్తున్నారు. తమన్ సంగీతం చేయనుండగా.. నవీన్ నూలీ ఈ చిత్రాన్ని ఎడిట్ చేయనున్నారు. ఎస్వీసీ బ్యానర్ పై దిల్ రాజు- శిరీష్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి హీరోయిన్లు ఇంకా ఖరారు కాలేదు.