స్టార్ హీరో మోస్ట్ వెయిటింగ్ మూవీ రిలీజ్ డేట్ లాక్

Fri May 13 2022 08:00:01 GMT+0530 (IST)

Vikram Cobra Movie Release Date

తమిళ స్టార్ హీరో విక్రమ్ కోబ్రా సినిమా కోసం ఆయన అభిమానులు మరియు సినీ ప్రేక్షకులు చాలా కాలంగా ఎదురు చూస్తున్నారు. భారీ అంచనాల నడుమ రూపొందిన సినిమా లో విక్రమ్ చాలా విభిన్నమైన  గెటప్స్ తో కనిపించబోతున్నాడు అంటూ ఇప్పటికే వచ్చిన ఫస్ట్ లుక్ మరియు గ్లిమ్స్ తో క్లారిటీ ఇచ్చారు. సినిమా షూటింగ్ పూర్తి అవ్వడంతో విడుదల తేదీ కోసం అభిమానులు వెయిట్ చేస్తున్నారు.కరోనా ముందు నుండే విక్రమ్ కోబ్రా సినిమా తో ఊరిస్తూ వస్తున్నాడు. అదుగో ఇదుగో అంటూ రెండు సంవత్సరాలుగా సినిమా గురించి ప్రచారం చేస్తున్న మేకర్స్ విడుదల తేదీ విషయంలో ఒక స్పష్టత ఇవ్వక పోవడంతో అభిమానులు అసంతృప్తితో ఉన్నారు. పైగా ఇంకా ఎంత కాలం ఈ సినిమా కోసం వెయిట్ చేయాలంటూ వారు అసహనంతో ఉన్నారట.

ఎట్టకేలకు సినిమా విడుదల తేదీ విషయంలో ఒక క్లారిటీ ఇచ్చేందుకు మేకర్స్ సిద్ధం అయ్యారు. తమిళ మీడియా వర్గాల నుండి విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం ఆగస్టు నెలలో ఈ సినిమాను ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల చేయాలని నిర్ణయించారట. సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ను శరవేగంగా జరుపుతున్నారు.

ఆగస్టు 11వ తారీకున సినిమా ను తమిళంతో పాటు ఇంకా తెలుగు ఇతర భాషల్లో విడుదల చేసే విధంగా ప్లాన్ చేశారు. అన్ని చోట్ల కూడా రిలీజ్ స్మూత్ గా ఉండేలా ప్లాన్ చేస్తున్నారట. ఒకటి రెండు వారాల్లో సినిమా విడుదల తేదీ విషయంలో విక్రమ్ నుండి స్పష్టత తీసుకుని మేకర్స్ బయ్యర్లతో మాట్లాడి నిర్ణయాన్ని తీసుకుంటారనే వార్తలు వస్తున్నాయి.

కోబ్రా సినిమాలో టీం ఇండియా మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పటాన్ కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. మృనాలి రవి.. మియా.. కేఎస్ రవికుమార్  లు కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వంలో రూపొందిన ఈ భారీ సినిమాకు ఏఆర్ రహమాన్ సంగీతాన్ని అందించిన విషయం తెల్సిందే. సినిమా విడుదల తేదీ లాక్ అవ్వడంతో విక్రమ్ అభిమానులు ఆనందంగా ఉన్నారు.