Begin typing your search above and press return to search.

బాహుబ‌లి రైట‌ర్ హ‌వా ఇప్ప‌టికీ త‌గ్గ‌లేదుగా

By:  Tupaki Desk   |   15 July 2020 5:15 AM GMT
బాహుబ‌లి రైట‌ర్ హ‌వా ఇప్ప‌టికీ త‌గ్గ‌లేదుగా
X
బాహుబ‌లి రైట‌ర్ గా విజ‌యేంద్ర ప్ర‌సాద్ కి వ‌చ్చిన హైప్ తెలిసిందే. అప్ప‌టివ‌ర‌కూ ఆయ‌న ఎన్నో బ్లాక్ బ‌స్ట‌ర్ చిత్రాల‌కు క‌థ‌లు అందించినా రాని గుర్తింపు ఆ ఒక్క పాన్ ఇండియా సినిమాతో వ‌చ్చేసింది. తెలుగు-త‌మిళం-హిందీ-మ‌ల‌యాళం- క‌న్న‌డ రంగాల్లో అత‌డి పేరు మార్మోగిపోయింది. ఆ వెంట‌నే స‌ల్మాన్ ఖాన్ హీరోగా క‌బీర్ ఖాన్ ద‌ర్శ‌క‌త్వంలో విజ‌యేంద్రుని స్క్రిప్టుతో తెర‌కెక్కిన `భ‌జ‌రంగి భాయిజాన్` సంచ‌ల‌న విజ‌యం సాధించ‌డంతో ఇక ఆయ‌న పేరు మ‌రింత‌గా మార్మోగింది. చిరంజీవి `ప‌సివాడి ప్రాణం` సినిమా క‌థ‌నే హిమాల‌యాలు తీవ్ర‌వాదానికి అనువ‌ర్తించి స్క్రిప్టుగా తిర‌గ‌రాసాన‌ని ఆయ‌నే అంగీక‌రించారు.

ముఖ్యంగా బాలీవుడ్ లో అవ‌కాశాలు తెచ్చేందుకు భ‌జ‌రంగి స‌క్సెస్ ఒక గీటురాయిగా మారింది. బాహుబ‌లి1.. బాహుబ‌లి 2.. భ‌జ‌రంగి భాయిజాన్ చిత్రాల స‌క్స‌స్ తో విజ‌యేంద్రుడిలోని విల‌క్ష‌ణ ర‌చ‌యిత‌ను హిందీ ద‌ర్శ‌క‌నిర్మాత‌లు అర్థం చేసుకుని అవ‌కాశాలివ్వ‌డం ప్రారంభించారు. ఇక క్వీన్ కంగ‌న ర‌నౌత్ అయితే ఆయ‌న‌ను ప‌ర్మినెంట్ గానే హైర్ చేసుకుని వ‌రుస‌గా త‌న సినిమాల‌కు స్క్రిప్టుల్ని రాయించుకుంటోంది. ఇంత‌కుముందు మ‌ణిక‌ర్ణిక (ఝాన్సీ రాణి) చిత్రానికి విజ‌యేంద్ర ప్ర‌సాద్ స్క్రిప్టును అందించారు. ఆ సినిమా స‌క్సెస్ ఇద్ద‌రి మ‌ధ్యా బంధాన్ని మ‌రింత బ‌ల‌ప‌డేలా చేసింది.

విజయేంద్ర ప్రసాద్ హిందీలో రాసిన కొన్ని స్క్రిప్ట్స్ త్వరలో సెట్స్ కెళ్ల‌నున్నాయి. వాటిలో ఒకటి కంగనా రనౌత్ దర్శకురాలిగా ఆరంగేట్రం చేసేది ఉంది. అలాగే కంగ‌న టైటిల్ పాత్ర‌లో తెర‌కెక్కుతున్న త‌లైవి చిత్రానికి విజయేంద్ర ప్ర‌సాద్ స్క్రిప్టు అందించిన సంగ‌తి విధిత‌మే. తెలుగు-త‌మిళ్-హిందీలో రిలీజ్ కానున్న ఈ బ‌హుభాషా చిత్రం ప్ర‌స్తుతం సెట్స్ పై ఉంది. విజయేంద్ర ప్రసాద్ కొన్ని వెబ్ సిరీస్ స్క్రిప్టుల్ని అందించారు. ఓటీటీ కోసం ఇవి రెడీ అవుతున్నాయి. అటు బాలీవుడ్ ఇటు సౌత్ రెండుచోట్లా విజ‌యేంద్రుడి హ‌వా ఆ రేంజులో సాగుతోంది.