కుర్ర హీరోయిన్లకు మ్యాడమ్ కోటింగ్

Wed Sep 11 2019 12:47:07 GMT+0530 (IST)

Vijayashanti Comments on Young Heroines in Teugu Film Industry

నవతరం కథానాయికల తీరుతెన్నులు లేడీ బాస్ విజయశాంతికి నచ్చడం లేదా?  నాటి కాలంతో పోలిస్తే నేటితరం నాయికలు అస్సలు పూర్తి స్థాయిలో నటనకు న్యాయం చేయడం లేదా? అంటే అవుననే అర్థమవుతోంది. ఆ మేరకు ఓ ఇంటర్వ్యూలో నేటితరంపై కౌంటర్ వేశారు మ్యాడమ్.మా రోజుల్లో 24/7 పని చేస్తూ ఏడాదికి డజనున్నర సినిమాలు చేసేసేవాళ్లం.  కానీ ఈ రోజుల్లో అలా లేరు. ఎవరూ కెరీర్ పై మరీ అంత సీరియస్ గా ఫోకస్ పెడుతున్నారని అనిపించడం లేదు. ఏడాదికి రెండు మూడు సినిమాల్లో మాత్రమే నటిస్తున్నారు. లగ్జరీ యాటిట్యూడ్ తో ఉంటున్నారు. ఇదేమీ అంత గొప్ప పనితనం కాదనేది నా భావన. నేటితరంలో నన్ను అంత మెప్పించిన నాయికలెవరూ లేరు.. అంటూ కొట్టి పారేశారు విజయశాంతి.

అయితే ఆరోజులతో పోలిక పెడుతూ నేటి తరాన్ని పోల్చడం సరైనదేనా? అంటే కానేకాదు. అప్పటి సన్నివేశం వేరు. ఎన్టీఆర్-ఏఎన్నార్-కృష్ణ- శోభన్ బాబు ఏడాదికి అరడజను నుంచి డజను తగ్గకుండా సినిమాలు చేసేసేవారు. వాళ్లకు అంతమంది అన్నేసి సినిమాలకు హీరోయిన్లు అవసరం పడితే కేవలం అరడజను మంది మాత్రమే అప్పట్లో అందుబాటులో ఉన్నారు. కానీ ఇప్పుడలా కాదు. రోజుకో హీరోయిన్ పుట్టుకొస్తోంది. అందులో నటించేవాళ్ల కంటే గ్లామర్ ఒలకబోసే భామలే ఎక్కువ. ఇక మేకింగ్ పరంగానూ 150 రోజుల నుంచి 200 రోజులు తీయనిదే భారీ బడ్జెట్ సినిమాలకు కుదరడం లేదు. ప్రతిదీ మేకింగ్ పరంగా క్వాలిటీ పెరిగింది. వీటన్నిటి దృష్ట్యా కథానాయికలు రెండు మూడు సినిమాల్ని మించి చేయలేని పరిస్థితి. ఈ తరంలో సమంత- కాజల్ - తమన్నా వీళ్లంతా ఏడాదికి మూడు నాలుగు సినిమాల మినిమం స్పీడ్ ని కొనసాగిస్తున్నారు. అవి కూడా భారీ బడ్జెట్ చిత్రాలతోనే ఈ కుస్తీలన్నీ. మరి మ్యాడమ్ థింకింగ్ సరైనదేనా? అన్నది తానే చెక్ చేసుకుంటే మంచిది.