పూరి డైలాగ్ చెప్పాలంటే రాసిపెట్టుండాలి: విజయ్ దేవరకొండ

Mon Aug 15 2022 12:05:21 GMT+0530 (IST)

VijayDevarkonda Speech At Warangal

విజయ్ దేవరకొండ అభిమానులంతా ఆయన తాజా చిత్రమైన 'లైగర్' కోసం వేయికళ్లతో వెయిట్ చేస్తున్నారు. పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఈ నెల 25వ తేదీన థియేటర్లలో దిగిపోనుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా టీమ్ 'ఫ్యాన్ డమ్ టూర్' ను నిర్వహించింది. వరంగల్ వెళ్లిన ఈ సినిమా టీమ్ .. అక్కడ అభిమానుల సమక్షంలో సందడి చేసింది.ఈ వేదికపై విజయ్ దేవరకొండ మాట్లాడుతూ .. " ఈ ఈవెంట్ కి వచ్చినవాళ్లకి  .. చూస్తున్నవాళ్లకి లాట్స్ ఆఫ్ లవ్. నేను ఎక్కడ తిరుగుతున్నా మనోళ్లు ఎట్లా ఫీలవుతున్నారు .. 'లైగర్' గురించి ఏమనుకుంటున్నారు? అనుకుంటూ  మీ గురించే ఆలోచన చేస్తుంటాను.

సాధ్యమైనంత తొందరగా మనోళ్లను కలవాలనే ఉద్దేశంతో ఇక్కడ ఈవెంట్ ను పెట్టడం జరిగింది. ఇక్కడ ఇంకా పెద్ద ఈవెంట్ ను చేద్దామని అనుకున్నాంగానీ .. వర్షం వల్ల కుదరలేదు. ఇండియాలో నేను ఎక్కడికి వెళ్లినా జనాలు విపరీతంగా వస్తున్నారు .. ఎంతో ప్రేమను చూపిస్తున్నారు. దీనంతటికి కారణం మీరే .. మీరు ఇచ్చిన ప్రేమ వల్లనే ఈ రోజున ఇక్కడ నిలబడ్డాను. మీరిచ్చిన ఈ ప్రేమను మీకు ఈ నెల 25న మీకు తిరిగి ఇచ్చేయడానికి రెడీగా ఉన్నాను. సినిమా మీద ఎలాంటి డౌట్ లేదు .. బ్లాక్ బస్టర్ ఖాయం.

సినిమాపై నేను చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాను .. కాకపోతే వరంగల్ నుంచి వరల్డ్ ను షేక్ చేయవలసింది మీరే. మీరంతా వేసే విజిల్స్ ఇండియా మొత్తానికి వినిపించాలి. నేను ఈ స్టేజ్ పై చిన్న పిల్లోడినే .. నన్ను సూపర్ స్టార్ అని పిలిస్తే ఇబ్బందిగా అనిపిస్తుంది.

ఆ పేరుకి తగినంతగా నేను చేయలేదు .. చేయవలసింది చాలా ఉంది. నేను .. పూరిగారు మా నాన్నలా .. చార్మీ గారు మా అమ్మలా ముగ్గురం కలిసి ఇండియాను షేక్ చేద్దామని హైదరాబాద్ నుంచి బయల్దేరి ముంబైకి వెళ్లాము. ఇక ఏ ఇబ్బంది వచ్చినా గట్టిగా కొట్టాల్సిందే అని ఫిక్స్ అయ్యాము.

పూరి గారు రాసిన డైలాగ్ చెప్పాలంటే అదృష్టం ఉండాలి .. దేవుడి దీవెనలు ఉండాలి. అలాంటి అదృష్టం నాకు కలిగినందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ సినిమాలో నాకు ఇష్టమైన ఒక డైలాగ్ ఒకటి ఉంది .. ఆ డైలాగ్ కి నేను బాగా కనెక్ట్ అయ్యాను. నాతో పాటు మీ అందరూ ఆ డైలాగ్ చెప్పండి. "వి ఆర్ ఇండియన్స్ .. పోదాం .. కొట్లాడదాం .. ఆగ్ హే అందర్ .. దునియాకో ఆగ్ లగా దేంగే. సబ్ కీ వార్ .. వార్ .. వాట్ లగా దేంగే. ఆగస్టు 25న మనమందరం కలిసి గట్టిగా కొట్టాలి. ఐ .. లవ్ .. యూ" అంటూ ముగించాడు.