Begin typing your search above and press return to search.

సీనియర్ హీరోయిన్ - యంగ్ హీరోల మ్యాజికల్ కెమిస్ట్రీ..!

By:  Tupaki Desk   |   19 May 2022 4:03 AM GMT
సీనియర్ హీరోయిన్ - యంగ్ హీరోల మ్యాజికల్ కెమిస్ట్రీ..!
X
రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ - స్టార్ హీరోయిన్ సమంత జంటగా నటిస్తున్న తాజా చిత్రం ''ఖుషి''. సెన్సిబుల్ డైరెక్టర్ శివ నిర్వాణ ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఇటీవల ఈ మూవీ టైటిల్ అనౌన్స్ చేసిన మేకర్స్.. అదే రోజు ఫస్ట్ లోక్ మోషన్ పోస్టర్ ని లాంచ్ చేశారు. అంతేకాదు సినిమా రిలీజ్ డేట్ ని కూడా ఫిక్స్ చేశారు.

'ఖుషీ' ఫస్ట్ లుక్ లో విజయ్ డిఫరెంట్ కాస్ట్యూమ్స్ లో స్టైలిష్ గా ఉండగా.. సామ్ సంప్రదాయ చీర కట్టులో మెరిసింది. ఇద్దరికీ పెళ్లి ముడి వేసి ఉండటం.. వీడీ పక్కన ఒక చిన్న బాస్కెట్.. బ్యాగ్రౌండ్ లో క్యాశ్మీర్ లొకేషన్స్ - రెండు శాంతి కపోతాలు.. ఇలా మోషన్ పోస్టర్ తోనే ఈ సినిమాపై ఆసక్తిని కలిగించారు.

అలానే మోషన్ పోస్టర్ లో మాంగల్యం తంతునామేనా మంత్రాలతో పాటు 'ఖుషీ.. నువ్ కనపడితే.. ఖుషీ.. నీ మాట వినపడితే.. ఖుషి.. నువ్ జత కడితే.. ఖుషీ.. నా ఒళ్ళంతా తుళ్ళింతే..' అంటూ వచ్చిన నేపథ్య సంగీతం ఆకట్టుకుంది. మలయాళ మ్యూజిక్ డైరెక్టర్ హేషమ్ అబ్దుల్ వహాబ్ ఈ గ్లిమ్స్ తోనే అందరి దృష్టిలో పడ్డాడు.

'ఖుషి' ఫస్ట్ లుక్ మరియు టైటిల్ సాంగ్ గ్లింప్స్ కు ప్రేక్షకుల నుంచి అనూహ్య స్పందన లభించింది. యూట్యూబ్ లో 3 మిలియన్లకు పైగా వ్యూస్ రాబట్టింది. విజయ్ దేవరకొండ & సమంతా రూత్ ప్రభు ఈ టైటిల్ ట్రాక్‌ తో స్క్రీన్‌ పై మ్యాజిక్‌ సృష్టించి మ్యాజికల్ జోడీ అనిపించుకున్నారు. మరి వీరి మధ్య కెమిస్ట్రీ ఎలా పండిందో తెలియాలంటే రిలీజ్ ఏడాది చివరి వరకూ ఆగాల్సిందే.

రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న 'ఖుషి'.. VD - సామ్ కెరీర్ లలో మెమొరబుల్ ఫిల్మ్ గా మిగులిపోతుందని టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ తోనే స్పష్టమైంది. అందులోనూ పవన్ కల్యాణ్ సూపర్ హిట్ 'ఖుషి' సినిమా టైటిల్‌ తో వస్తుండటంతో అందరిలో ప్రత్యేకమైన ఆసక్తి నెలకొంది.

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ కశ్మీర్‌ లోయలోని పలు అందమైన లొకేషన్లలో శరవేగంగా జరుపుకుంటోంది. ఈ షెడ్యూల్ తర్వాత చిత్ర బృందం సౌత్ కు షిఫ్ట్ అవనున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యేర్నేని - రవిశంకర్ యలమంచిలి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

జి మురళి సినిమాటోగ్రఫీ అందిస్తుండగా.. ఉత్తర్ కుమార్ - చంద్రిక ఆర్ట్ డైరెక్టర్స్ గా వ్యవహరిస్తున్నారు. జయశ్రీ లక్ష్మీనారాయణన్ ప్రొడక్షన్ డిజైనింగ్ చేయగా.. ప్రవీణ్ పూడి ఎడిటింగ్ చూసుకుంటున్నారు. పీటర్ హెయిన్ యాక్షన్ కొరియోగ్రఫీ చేస్తున్నారు. తెలుగు, కన్నడ, తమిళ, మలయాళ భాషల్లో డిసెంబర్ 23న 'ఖుషి' సినిమాను విడుదల చేయనున్నారు.