Begin typing your search above and press return to search.

మరో అర్జున్‌ రెడ్డి కోసం ప్రయత్నాలు

By:  Tupaki Desk   |   21 Feb 2020 4:30 PM GMT
మరో అర్జున్‌ రెడ్డి కోసం ప్రయత్నాలు
X
విజయ్‌ దేవరకొండకు ప్రస్తుతం ఈ స్థాయిలో క్రేజ్‌ ఉందంటే అది ఖచ్చితంగా అర్జున్‌ రెడ్డి వల్లే. సందీప్‌ రెడ్డి వంగ దర్శకత్వంలో తెరకెక్కిన ఆ చిత్రంలో విజయ్‌ దేవరకొండ పోషించిన పాత్రతో టాలీవుడ్‌ లో స్టార్‌ గా నిలిచాడు. ఆ చిత్రం తర్వాత గీత గోవిందంతో మరో విజయాన్ని విజయ్‌ దేవరకొండ దక్కించుకున్నాడు. గీత గోవిందం చిత్రం తర్వాత ఇప్పటి వరకు మళ్లీ కమర్షియల్‌ సక్సెస్‌ ను దక్కించుకోవడంలో విఫలం అవుతూనే ఉన్నాడు.

ఇటీవల ఈయన వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మరో ఫ్లాప్‌ ను మూట కట్టుకున్నాడు. ప్రస్తుతం పూరి దర్శకత్వంలో లైగర్‌ చిత్రాన్ని చేస్తున్నాడు. విజయ్‌ దేవరకొండ క్రేజ్‌ కంటిన్యూ అవ్వాలి అంటే అర్జున్‌ రెడ్డి తరహా మాంచి కమర్షియల్‌ హిట్‌ ఒకటి పడాలి. ఆ హిట్‌ కోసం విజయ్‌ దేవరకొండ చాలా ప్రయత్నాలు చేస్తున్నాడు. పూరితో మూవీ అంటే జూదమే. అది ఎలా ఉంటుందో చెప్పలేం. అందుకే ఖచ్చితంగా సక్సెస్‌ ఇస్తాడనే నమ్మకంతో మళ్లీ సందీప్‌ వంగతోనే సినిమా చేయాలని ఈ రౌడీ స్టార్‌ నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది.

హిందీలో అర్జున్‌ రెడ్డి రీమేక్‌ చేసిన సందీప్‌ అక్కడ తదుపరి చిత్రం చేసేందుకు ప్రయత్నాలు చేసినా ఏది వర్కౌట్‌ అవ్వలేదు. పలువురు హీరోలు ఈయన దర్శకత్వంలో నటించేందుకు ఆసక్తి చూపించినా కూడా ప్రస్తుతానికి మాత్రం సందీప్‌ రెడ్డికి డేట్లు ఎవరు ఇవ్వలేమన్నారు. దాంతో తెలుగు హీరోతో తెలుగు.. హిందీ భాషల్లో ఒక సినిమాను తీయాలని సందీప్‌ భావిస్తున్నాడు.

విజయ్‌ దేవరకొండ హీరోగా టీ సిరీస్‌ బ్యానర్‌ లో సందీప్‌ సినిమా మొదలు పెట్టబోతున్నాడట. లైగర్‌ చిత్రం తర్వాత ఈ సినిమా ఉంటుందని అంటున్నారు. అర్జున్‌ రెడ్డిని మించి ఈ సినిమా ఉంటుందనే టాక్‌ ఇండస్ట్రీలో వినిపిస్తుంది. అయితే ఈ కాంబోపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.