Begin typing your search above and press return to search.

అది మహేష్ - విజయ్ కాంబోలో రావాల్సిన సినిమా!

By:  Tupaki Desk   |   4 Jun 2020 11:10 AM GMT
అది మహేష్ - విజయ్ కాంబోలో రావాల్సిన సినిమా!
X
ఇద్దరు బడా స్టార్ హీరోలు కలిసి నటిస్తున్నారంటే అది తప్పనిసరిగా భారీ ప్రాజెక్ట్ అయి ఉంటుంది. సినిమాపై భారీ అంచనాలు నెలకొంటాయి. ఇక రెండు భాషల స్టార్ హీరోలు నటిస్తున్నారంటే ఆ సినిమా రేంజ్ మారిపోతుంది. గతంలో మహేష్ బాబు.. తమిళ స్టార్ హీరో విజయ్ కాంబినేషన్ లో ఒక సినిమా రానుందని జోరుగా ప్రచారం సాగింది అయితే ఆ ప్రాజెక్టు ఎందుకో కానీ సాకారం కాలేదు. సౌత్ లో ఇద్దరు స్టార్ల కాంబినేషన్ మిస్ అయిందని అనుకున్నారు.

ఈమధ్యే మణిరత్నం దగ్గర అసిస్టెంట్ గా పనిచేసిన ధన ఈ విషయం నిజమేనని ధృవీకరించారు. ధన గతంలో మణిరత్నం దగ్గర అసిస్టెంట్ గా పని చేసినప్పుడు ఈ సినిమా ప్లానింగ్ జరిగిందట. మహేష్.. విజయ్ ఇద్దరూ ప్రధాన పాత్రలలో మణి సార్ 'పొన్నియన్ సెల్వన్' చిత్రం ప్లాన్ చేశారట. అయితే ఆ కాంబినేషన్ వర్క్ అవుట్ కాలేదని అన్నారు. ప్రస్తుతం మణి సారు ఈ చిత్రాన్ని విక్రమ్.. కార్తి.. జయం రవి హీరోలుగా భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే.

ఏదేమైనా సౌత్ ప్రేక్షకులు మాత్రం ఓ రేర్ కాంబినేషన్ ను మిస్ అయినట్టే. మరి భవిష్యత్తులో ఎవరైనా మహేష్ - విజయ్ కాంబినేషన్ లో ఓ కమర్షియల్ ఎంటర్టైనర్ ప్లాన్ చేస్తారేమో చూడాలి. ఒకవేళ ఈ కాంబో సెట్ చేస్తే మాత్రం బాక్స్ ఆఫీసు దద్దరిల్లిపోవడం ఖాయం.