ట్రేడ్ మార్క్ చప్పల్స్ ని వదిలేసిన VD!

Wed Aug 10 2022 20:50:21 GMT+0530 (IST)

Vijay and Ananya opt for stylish black ensembles as they promote Liger in Mumbai

విజయ్ దేవరకొండ- అనన్య పాండే జంటగా నటించిన `లైగర్` ఈనెల 25న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం టీమ్ భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ ని ప్రమోట్ చేయడానికి నగరాల మధ్య ప్రయాణాలతో బిజీగా ఉన్నారు. ఇటు టాలీవుడ్ అటు బాలీవుడ్ లో ఈ మూవీ ప్రచారం మరో లెవల్లో కొనసాగుతోంది. ముఖ్యంగా పూరి టీమ్ ఉత్తరాది మార్కెట్ పై పెద్దగా గురి పెట్టింది. అందుకు తగ్గట్టే ముంబై సహా ముఖ్యమైన ఉత్తరాది నగరాల్లో ప్రచారం నిర్వహిస్తోంది. ఈరోజు విజయ్- అనన్య జంట ముంబైలోని సన్ అండ్ శాండ్ హోటల్ లో ప్రత్యక్షమయ్యారు.
 
VD నలుపు T-షర్టు- పింక్ ప్యాంటులో సంథింగ్ స్పెషల్ గా కనిపించాడు. కాంబినేషన్ గా అతడు ఆలివ్ గ్రీన్ షూస్ ని ధరించి ఎంతో స్పెషల్ గా యూత్ ని ఆకర్షించాడు. ఈ ఆలివ్ అండ్ బ్లాక్ బూట్ల కోసం చివరికి తన ట్రేడ్ మార్క్ చప్పల్స్ ని వదిలేయడం అందరి దృష్టిని ఆకర్షించింది. VD స్టైలిష్ లుక్ వారెవ్వా! అంటూ ఈ స్టిల్ కి యూత్ ఫిదా అయిపోతున్నారు.విజయ్ కి జతగా అనన్య పాండే బ్లాక్ మిడ్డీ లో థై సొగసుల్ని వడ్డించింది. ఇంతకుముందే బిజీ ప్రమోషనల్ షెడ్యూల్స్ నడుమ దేవరకొండ ఒక చిన్న కాఫీ బ్రేక్ లో కనిపించాడు. అందుకు సంబంధించిన స్టిల్ ను ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తూ `జస్ట్` అని క్యాప్షన్ ఇచ్చాడు. ఆ ఫోటో కూడా అంతర్జాలంలో వైరల్ అయ్యింది.
 
పూరి జగన్నాధ్ దర్శకత్వం వహించిన లైగర్ ఎమోషనల్ యాక్షన్ డ్రామాగా అలరించనుంది. ఇందులో  MMA ఫైటర్ పాత్రలో VD కనిపిస్తుండగా.. అనన్య పాండే అతడి లవర్ గా నటించింది. విజయ్ తల్లి పాత్రలో సీనియర్ నటి రమ్య కృష్ణ నటించారు. అతని కోచ్ పాత్రను రోనిత్ రాయ్ పోషించారు. ప్రపంచ బాక్సింగ్ దిగ్గజం మైక్ టైసన్ ఓ కీలక పాత్రలో కనిపిస్తుండగా.. విషు రెడ్డి- అలీ- మకరంద్ దేశ్ పాండే- గెటప్ శ్రీను ఇతర కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
 
సినిమా ప్రమోషన్ లో భాగంగా ఇటీవల `కాఫీ విత్ కరణ్ 7` సోఫాను కూడా విజయ్ అనన్య జంట అలంకరించిన సంగతి తెలిసిందే. హోస్ట్ కరణ్ జోహార్ వ్యక్తిగత ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేశారు. సహనటి అనన్య పాండేతో మొదటి సారి సెట్స్ లో  వైబ్ గురించి అడిగినప్పుడు దేవరకొండ సింపుల్ గా ఆన్సర్ ఇచ్చారు. ``అనన్య నన్ను నవ్విస్తుంది. చాలా అందమైన అమ్మాయి.. నేను తనతో ఉంటే చాలా ఎక్కువగా నవ్వుతాను. తను త్వరగా ప్రతిదీ నేర్చుకుంటుంది. లైగర్ లో అద్భుతంగా నటించింది`` అని అన్నాడు. లైగర్ తర్వాతా అనన్య టాలీవుడ్ లో నటించనుందన్న టాక్ వినిపిస్తోంది.