Begin typing your search above and press return to search.

300 కోట్ల క్లబ్ లో విజయ్ వారసుడు

By:  Tupaki Desk   |   7 Feb 2023 9:31 AM GMT
300 కోట్ల క్లబ్ లో విజయ్ వారసుడు
X
కోలివుడ్ హీరో విజయ్ ఈ సంక్రాంతికి వారసుడు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. తమిళ హీరో అయినప్పటికీ విజయ్ కు తెలుగులోనూ మంచి మార్కెట్ ఉంది. ద్విభాషా చిత్రంగా వారసుడు.. తెలుగు, తమిళ్ భాషల్లో రిలీజ్ అయింది. ఈ సినిమాను తెలుగు దర్శకుడు వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించగా... శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు, శిరీష్ నిర్మాతలుగా వ్యవహారించారు. ఇక ఈ సినిమా తమిళంలో జనవరి 11న విడుదల కాగా.. తెలుగులో జనవరి 14న విడుదలై హిట్ టాక్ తో ప్రపంచవ్యాప్తంగా భారీ వసూళ్లను సాధిస్తోంది.

ఇక వారసుడు సినిమా విషయానికి వస్తే... తాజాగా ఈ సినిమా 300 కోట్ల మార్కును చేరుకుంది. బిగిల్ తర్వాత విజయ్ కు ఆ రేంజ్ లో 300 కోట్ల గ్రాస్ కలెక్షన్లను వసూలు చేసిన చిత్రమిదే. ఇక తెలుగు, తమిళ్ లోనే కాకుండా.. కేరళ, కర్ణాటక, ఉత్తరాది రాష్ట్రాల్లోనూ ఈ సినిమా వసూళ్లను రాబడుతోంది. ఇక ఓవర్సీస్ లో కూడా ఈ సినిమా మంచి వసూళ్లను రాబట్టినట్లు తెలుస్తోంది.

ఇక ఈ సినిమా ఫ్యామిలీ ఎంటర్ టైన్ మెంట్ గా తెరకెక్కడం.. ప్రేక్షకులు ఈ సినిమాలో ఫీల్ గుడ్ ను కలిగించడంతో మంచి కలెక్షన్లు వస్తున్నట్లు తెలుస్తున్నాయి. ఇక ఈ సినిమాలో విజయ్ కు జోడీగా నేషనల్ క్రష్ రష్మిక మందన హీరోయిన్ గా నటించింది. ఈ చిత్రానికి తమన్ సంగీతం అందించాడు.

ఇందులో శ్రీకాంత్, శరత్‌కుమార్, ప్రభు, ప్రకాశ్ రాజ్, కిక్ శ్యామ్, కుష్బూ, జయసుధ కీలక పాత్రలు పోషించారు. ఇక ఈ సినిమా డిజిటల్, శాటిలైట్ రైట్స్ కూడా భారీ ధరకు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. విజయ్ వారసుడు మూవీకి ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాలను కలుపుకుని రూ. 137.90 కోట్లు బిజినెస్‌ జరిగిందని సమాచారం. దీంతో రూ. 139 కోట్లుగా బ్రేక్ ఈవెన్ టార్గెట్ గా నమోదు అయింది.

కుటుంబ కథా చిత్రానికి విజయ్ మార్క్ జోడించి వంశీ పైడిపల్లి తెరకెక్కించిన వారసుడు సినిమాకు ఇప్పటివరకు ఈ చిత్రం వరల్డ్ వైడ్‌ గా రూ. 294.77 కోట్లు గ్రాస్‌తో పాటు రూ. 150.42 కోట్లు షేర్‌ను రాబట్టిందని ట్రెడ్ వర్గాల సమాచారం. ఇక ట్రెడ్ రిపోర్ట్స్ ప్రకారం వారిసు నాలుగవ వారాంతంలో కూడా చాలా సెంటర్లలో హౌస్‌ఫుల్‌ గా ఉంది. ఇక విజయ్ ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తాడో వేచి చూడాలి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.