Begin typing your search above and press return to search.

మహేష్ ను ఢీకొట్టనున్న విజయ్..?

By:  Tupaki Desk   |   28 Nov 2021 12:30 AM GMT
మహేష్ ను ఢీకొట్టనున్న విజయ్..?
X
పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న పాన్ ఇండియా స్పోర్ట్స్ యాక్షన్ ఫిల్మ్ ''లైగర్''. బాక్సింగ్ క్రీడ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఫైనల్ షెడ్యూల్ షూటింగ్ ఇటీవలే యూఎస్ఏ లో ప్రారంభమైన సంగతి తెలిసిందే. బాక్సింగ్ వీరుడు మైక్ టైసన్ పాల్గొనే కీలక సన్నివేశాల చిత్రీకరణతో షూట్ మొత్తం కంప్లీట్ అయింది. ఈ క్రమంలో చిత్ర బృందం ఇప్పుడు మ్యూజిక్ కంపోజిషన్ ప్రాసెస్ ను ప్రారంభించినట్లు తెలుస్తోంది.

ఇదిలా ఉంటే 'లైగర్' చిత్రాన్ని అప్పుడెప్పుడో రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు. కానీ కరోనా కారణంగా షూటింగ్ డీలే అవడం.. ఈ క్రమంలో మైక్ టైసన్ పాల్గొనే యూఎస్ షెడ్యూల్ లేట్ అవుతూ వచ్చింది. మొత్తం మీద టాకీ పార్ట్ చిత్రీకరణ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ దశలో అడుగుపెట్టింది. దీంతో ఇప్పుడు మేకర్స్ రిలీజ్ డేట్ ని లాక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది.

ఈ నేపథ్యంలో పాన్ ఇండియా స్థాయిలో 'లైగర్' సినిమా కోసం 2022 ఏప్రిల్ 1 తాత్కాలిక విడుదల తేదీగా నిర్ణయించబడిందని రూమర్స్ వస్తున్నాయి. ఇదే ఫైనలైజ్ చేస్తే సూపర్ స్టార్ మహేష్ బాబుతో విజయ్ దేవరకొండ పోటీ పడాల్సి వస్తుంది. ఎందుకంటే 'సర్కారు వారి పాట' కోసం అదే డేట్ ని లాక్ చేశారు. సంక్రాంతి కానుకగా విడుదల అవ్వాల్సిన ఈ చిత్రాన్ని RRR కోసం పోస్ట్ పోన్ చేశారు. కానీ ఇప్పుడు ఏప్రిల్ లో కూడా మహేష్ కు పోటీ తప్పదని టాక్ వినిపిస్తోంది.

'సర్కారు వారి పాట' రీజనల్ మూవీ అయితే.. 'లైగర్' పాన్ ఇండియా మూవీ. అందుకే విజయ్ ఇతర ఇండస్ట్రీలలో కూడా పోటీ లేకుండా చూసుకోవాల్సిన ఉంటుంది. ఇక కరణ్ జోహార్ వంటి బాలీవుడ్ ప్రొడ్యూసర్ ఈ సినిమా పనులన్నీ దగ్గరుండి చూసుకుంటున్నారు. ఒకసారి మంచి రిలీజ్ డేట్ ని వదులుకున్న మహేష్ ను రిక్వెస్ట్ చేసినా.. మరోసారి వాయిదాకు మొగ్గుచూపకపోవచ్చు.

అయితే మహేష్ తో వీడీ మరియు కరణ్ జోహార్ లకు మధ్య మంచి సాన్నిహిత్యం ఉంది. అంతేకాదు బాక్సాఫీస్ క్లాష్ వల్ల ఓపెనింగ్స్ సరిగా రాకపోగా కలెక్షన్స్ మీద ప్రభావం చూపుతుంది. ఈ అంశాలను పరిగణనలోకి తీసుకుంటే మహేష్ ను ఢీకొట్టడానికి విజయ్ సుముఖంగా ఉండకపోవచ్చు.

అందుకే 'లైగర్' సినిమా కోసం 2022 మే 9వ తేదీని పరిశీలిస్తున్నారని మరో న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. నిండు వేసవికి వస్తే హాలిడేస్ కూడా కలిసొస్తాయని మేకర్స్ ఆలోచిస్తున్నారట. మరి విజయ్ దేవరకొండ ఫస్ట్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ రిలీజ్ కోసం ఏ డేట్ ని లాక్ చేస్తారో చూడాలి.