Begin typing your search above and press return to search.

సేతుపతికి ఏకంగా ఆమిర్ ఖాన్ నుంచి పిలుపు?

By:  Tupaki Desk   |   27 May 2020 5:30 AM GMT
సేతుపతికి ఏకంగా ఆమిర్ ఖాన్ నుంచి పిలుపు?
X
గత రెండు మూడేళ్ళుగా సౌత్ అంతా సూపర్ నటుడని మార్మోగిపోతున్న పేరు విజయ్ సేతుపతి. తమిళ సినిమాల్లోనే తన సత్తా చాటినా సేతుపతి నటనకు ఫిదా అయ్యి తెలుగు మేకర్స్ కూడా ఆఫర్లు ఇస్తున్నారు. ఇప్పటికే విజయ్ సేతుపతి మెగాస్టార్ చిరంజీవి 'సైరా' లో ఒక కీలక పాత్రలో నటించాడు. ఇక వైష్ణవ్ తేజ్ డెబ్యూ ఫిలిం 'ఉప్పెన' లో కూడా నటిస్తున్నారు. ఇవే కాకుండా అల్లు అర్జున్ 'పుష్ప' లో కూడా నటింపజేసే ప్రయత్నాలు జరిగాయని వార్తలు వచ్చాయి.

ఇదిలా ఉంటే తాజాగా కోలీవుడ్ మీడియాలో వినిపిస్తున్నటాక్ ఏంటంటే విజయ్ సేతుపతికి బాలీవుడ్ నుంచి ఓ క్రేజీ ఆఫర్ వచ్చిందట. Mr. పర్ఫెక్షనిస్ట్ అని పేరు తెచ్చుకున్న ఆమిర్ ఖాన్ ప్రస్తుతం 'లాల్ సింగ్ చద్దా' అనే చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమాలో ఒక ముఖ్యమైన పాత్రకు సేతుపతిని తీసుకున్నారట. ఈ సినిమాలో సేతుపతి పాత్ర పేరు 'కార్తిక్ రాజశేఖర్' అని కూడా అంటున్నారు.. ఈ విషయంపై ఇంకా అధికారిక ప్రకటన అయితే రాలేదు కానీ ఇదెలా సాధ్యమని చాలామంది సౌత్ యాక్టర్లు జుట్టు పీక్కుంటున్నారు. కారణం ఏంటంటే ఈ సినిమా షూటింగ్ ప్రారంభమై ఇప్పటికే చాలాకాలమైంది. మరోవైపు మహమ్మారి విజృంభణ తర్వాత ఫిలిం మేకర్లు పరాయి భాషల వారిని తీసుకోవాలంటే తటపటాయిస్తున్నారు. మరి ఇలాంటి పరిస్థితులలో ఆమిర్ ఖాన్ టీమ్ సేతుపతికి ఆఫర్ ఇవ్వడం గొప్ప విషయమే.

ఒకవేళ ఈ ఆఫర్ నిజమే అయితే విజయ్ సేతుపతి బాలీవుడ్ పయనం ఎలా ఉంటుందో వేచి చూడాలి. నటనతో ప్రేక్షకులను కట్టిపడేయడం విజయ్ సేతుపతికి వెన్నతో పెట్టిన విద్య మరి ఈ 'లాల్ సింగ్ చద్దా' తో బాలీవుడ్ ను షేక్ చేస్తాడేమో!