Begin typing your search above and press return to search.

షారుక్ ని ఢీ కొట్ట‌డానికి రెడీ అయిన సేతుపతి

By:  Tupaki Desk   |   14 Aug 2022 11:32 AM GMT
షారుక్ ని ఢీ కొట్ట‌డానికి రెడీ అయిన సేతుపతి
X
షారుక్ ఖాన్ క‌థానాయ‌కుడిగా అట్లీ ద‌ర్శ‌క‌త్వంలో భారీ యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ 'జ‌వాన్' తెర‌కెక్కుతోన్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే రిలీజ్అయిన షారుక్ ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ ఫ్యాన్స్ లో ఫీవ‌ర్ పెచింది. అట్లీ స‌క్సెస్ ట్రాక్ స‌హా ఎన్నో కార‌ణాలు 'జ‌వాన్' విజ‌యంతో షారుక్ గ‌త వైభ‌వాన్ని అందుకుంటాడు? అన్న కాన్పిడెన్స్ అభిమానుల్లో క‌నిపిస్తుంది.

'జ‌వాన్' తో సౌత్ మార్కెట్ ని షారుక్ సైతం గ‌ట్టిగానే టార్గెట్ చేసిన‌ట్లు క‌నిపిస్తుంది. ఇందులో హీరోయిన్ గా న‌య‌న‌తార‌ని ఏరికోరి మ‌రీ ఎంపిక చేసారు. అందుకుగానూ అమ్మ‌డికి భారీగా పారితోషికం చెల్లించారు. ఇంకా కొన్ని కీల‌క పాత్ర‌ల‌కు కోలీవుడ్ న‌టుల్ని ఎంపిక చేసారు. తాజాగా సినిమాలో ప్ర‌తి నాయ‌కుడి పాత్ర కి కోలీవుడ్ సంచ‌ల‌న స్టార్ విజ‌య్ సేతుప‌తిని ఎంపిక చేసిన‌ట్లు అధికారికంగా ప్ర‌క‌టించారు.

ఇంత‌వ‌ర‌కూ సేతుప‌తి సినిమాలో నటిస్తున్నాడని..అది గెస్ట్ అప్పీరియ‌న్స్ లా ఉండొచ్చ‌ని అంతా భావించారు. కానీ సేతుప‌తికి బరువైన బాధ్య‌త‌లే అప్ప‌గించారు. ఏకంగా షారుక్ ని ఢీకొట్టే విల‌న్ పాత్రకే విజ‌య్ ని ఎంపిక చేసారు. త్వ‌ర‌లోనే టీమ్ తో జాయిన్ కానున్న‌ట్లు తెలిపారు. సేతుప‌తి ఎంట్రీతో సినిమా స్పాన్ పెరుగుతుంద‌ని చెప్పొచ్చు.

ఇప్ప‌టికే కోలీవుడ్ లో సంచ‌ల‌న న‌టుడిగా కొన‌సాగుతున్నాడు. హీరో అయినా... విల‌న్ అయినా..సైడ్ క్యారెక్ట‌ర్ అయినా సేతుప‌తి రంగంలోకి దిగ‌నంత వ‌ర‌కే. దిగితే ఎలాంటి పాత్ర అయినా పండాల్సిందే. అంత గొప్ప న‌టుడిగా పేరు సంపాదించాడు. 'విక్ర‌మ్' సినిమాలో సంతానం పాత్ర‌తో పాన్ ఇండియా మరింత ఫేమ‌స్ అయ్యాడు.

ఇక తెలుగులో సేతుప‌తి గుర్తింపు చెప్పాల్సిన పనిలేదు. ఇండ‌స్ర్టీనే ఆయ‌న వెంట ప‌డుతుంది. ఇవ‌న్నీ గుర్తించే షారుక్ కి విల‌న్ గా అట్లీ మ‌క్క‌ల్ సెల్వ‌న్ ని దించుతున్న‌ట్లు క‌నిపిస్తుంది. విజ‌య్ సేతుప‌తి బ్రాండ్ తోనే సౌత్ లో సినిమాకి కావాల్సినంత మార్కెట్ క్రియేట్ అవుతుంది.

హిందీ వ‌ర‌కూ షారుక్ స‌రిపోతారు. కానీ సౌత్ లో వ‌ర్కౌట్ చేయాలంటే సేతుప‌తి లాంటి బ్రాండ్ ఇమేజ్ ఉన్న న‌టుడు త‌ప్ప‌నిస‌రి . ఈ లెక్క‌ల‌న్నీ బేరీజు వేసుకుని సేతుప‌తికి భారీగా పారితోషికం ఇచ్చి 'జ‌వాన్' లో కి తీసుకొచ్చారు.