Begin typing your search above and press return to search.

విజయ్​ సేతుపతి కూతురిని రేప్​ చేస్తా... వీడసలు మనిషేనా!

By:  Tupaki Desk   |   20 Oct 2020 11:30 AM GMT
విజయ్​ సేతుపతి కూతురిని రేప్​ చేస్తా...  వీడసలు మనిషేనా!
X
సోషల్​మీడియా పుణ్యమా అని కొందరు దుర్మార్గులు బరితెగించి పోతున్నారు. సెలబ్రిటీల కూతుర్లను, భార్యలను వివాదాల్లోకి లాగుతున్నారు. ఇంత నీచంగా కామెంట్లు పెడుతుంటే పోలీస్​ వ్యవస్థ ఏం చేస్తుందో అర్థం కావడం లేదని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. సీఎస్​కే టీం సరిగ్గా ఆడటంతో లేదని ధోని కూతురుని రేప్​ చేస్తానంటూ ఓ నీచుడు సోషల్​ మీడియాలో కామెంట్​ పెట్టాడు. అతడిని పోలీసులు అరెస్ట్​ చేశారు. అయితే తాజాగా మరో దుర్మార్గుడు కూడా ఇటువంటి వ్యాఖ్యలే చేశాడు. ‘విజయ్​ సేతుపతి .. ముత్తయ్య మురళీధర్​ బయోపిక్​లో నటిస్తే అతడి కూతురును రేప్​ చేస్తా’ అంటూ ట్వీట్​ చేశాడు. ఈ ట్వీట్​పై తీవ్ర దుమారం రేగుతున్నది. ‘800’ సినిమాలో విజ‌య్ సేతుప‌తి న‌టించ‌డ‌మే ఇలాంటి బెదిరింపుల‌కు కార‌ణం.

విజయ్​ ఈ సినిమాలో న‌టించొద్ద‌ని ఇప్పటికే త‌మిళ సంఘాలు ఒత్తిడి తెచ్చాయి. మరోవైపు ‘ఇటువంటి సినిమాలో నటించి నీ జీవితాన్ని నాశనం చేసుకోకు’ అంటూ నేరుగా ముత్తయ్య విజయ్​కు లేఖ రాశాడు.
ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి తప్పుకుంటున్నట్టు విజయ్​ ప్రకటించాడు కూడా. అయినప్పటికీ బెదిరింపులు మాత్రం ఆగడం లేదు. విజయ్‌పై ప‌రోక్ష దాడుల‌కు దిగుతున్నారు. ఈ వివాదంపై గాయ‌ని‌ చిన్మయి స్పందించారు. ‘ఇలాంటి నీచమైన వ్యక్తులే సమాజంలో లైంగిక నేరాలకు మద్దతు పలుకుతారు, దీనిని ఎవరూ మార్చలేరు?. అమ్మాయిలను బహిరంగంగా అత్యాచారం చేస్తానని చెప్తున్న వ్యక్తి నేరస్థుడు. ఇంత జరుగుతున్నా చూస్తూ ఊరుకుంటున్నారంటే సిగ్గుచేటు’ అంటూ ఫైర్ అయ్యింది.