Begin typing your search above and press return to search.

144సెక్ష‌న్ లో స్నేహం కోసం స్టార్ హీరో సాహ‌సం

By:  Tupaki Desk   |   4 April 2020 4:45 AM GMT
144సెక్ష‌న్ లో స్నేహం కోసం స్టార్ హీరో సాహ‌సం
X
లాక్ డౌన్ నేప‌థ్యంలో ఎవ‌రూ ఇళ్లు క‌ద‌ల‌డానికి వీల్లేదు. ఉద‌యం ఏడుగంట‌ల నుంచి 11 గం.ల వ‌ర‌కూ కేవ‌లం నిత్య‌వ‌స‌ర స‌రుకులు తెచ్చుకోవ‌డానికి మాత్ర‌మే అనుమ‌తి ఉంది. అదీ ఇంట్లో ఒక్క‌రే బ‌య‌ట‌కు రావాలి. అంత‌కు మించి ఎక్కువ మంది వ‌స్తే 144 సెక్ష‌న్ ప్ర‌కారం కేసులు న‌మోదు చేసి జైలుకెళ్లాల్సిందే. దాదాపు దేశం మొత్తం ఇదే ప‌రిస్థితి. ఇక సెల‌బ్రిటీలు ఇళ్ల‌కు ప‌రిమిత‌మై అవేర్ సెన్ కార్య‌క్ర‌మాల్లో నిమ‌గ్న‌మయ్యారు. తోచిన స‌హాయం చేస్తూ సోష‌ల్ మీడియా ద్వారా ప‌బ్లిసిటీ పొందుతున్నారు. ఎట్టి ప‌రిస్థితుల్లో లాక్ డౌన్ ఉన్నంత కాలం మాత్రం ఎవ‌రూ కాలు క‌ద‌పొద్దు అంటూ సినిమా వాళ్లు అంద‌రిక‌న్నా ఎక్కువ‌గానే చెబుతున్నారు.

అయితే త‌మిళ న‌టుడు విజ‌య్ సేతుప‌తి మాత్రం లాక్ డౌన్ నిబంధ‌న‌ల్ని అతిక్ర‌మించాడు. ఏకంగా ఓ కుటుంబంతో క‌లిసి వాళ్ల బాధ‌ను పంచుకున్నాడు. ఇంత‌కీ విజ‌య్ కు బ‌య‌ట‌కు రావాల్సినంత ప‌నేం ప‌డిందంటే? హృద‌యం క‌లిచి వేసే సంఘ‌ట‌నే జ‌రిగింద‌ని తెలుస్తోంది. విజ‌య్ సేతుప‌తి ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా కోలీవుడ్ లో అరంగేట్రం చేసి పెద్ద స్టార్ అయ్యాడు. సినిమాల్లోకి రాక‌ముందు విజ‌య్ మ‌ధ్య త‌ర‌గ‌తి కుటుంబానికి చెందిన వాడు. అత‌ని స్నేహితులు అంతే. ఈ క్ర‌మంలోనే పాత్రికేయుడు ర‌చ‌యిత అయిన‌ నెల్లాయ్ భార‌తి త‌న‌కు ప్రాణ స్నేహితుడు అయ్యాడు.

అయితే స‌ద‌రు జ‌ర్న‌లిస్ట్ గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో భాధ‌ప‌డుతూ శుక్ర‌వారం చెన్నైలో క‌న్ను మూసారు. దీంతో విజ‌య్ లాక్ డౌన్ ని బ్రేక్ చేసి స్నేహితుడు కోసం బ‌య‌ట‌కు రావాల్సి వ‌చ్చింది. ఆ కుటుంబాన్ని ఓదార్చి..కొంత ఆర్ధిక స‌హాయం చేసాడు. అలాగే అంత్యక్రియల‌ ఖ‌ర్చులు కూడా విజ‌య్ భ‌రించాడు. పాత స్నేహితుడు చివ‌రి చూపుకు నోచుకోక‌పోతే జీవితాంతం ఆ ఘ‌ట‌న త‌లుచుకుని బాధ‌ప‌డాలి. ఇది త‌ప్ప‌ని ప‌రిస్థితి. అందుకే రిస్క్ తీసుకుని బ‌య‌ట‌కు వ‌చ్చార‌ని నెటిజ‌నులు విజ‌య్ ని మెచ్చుకుంటున్నారు. స్నేహం కోసం సాహ‌స‌మిది. లాక్ డౌన్ ఉల్లంఘ‌న కానే కాదు. స‌న్నివేశం డిమాండ్ చేసింది కాబ‌ట్టే అలా చేయాల్సొచ్చింద‌ని స‌మ‌ర్థిస్తున్నారు.