Begin typing your search above and press return to search.

మాస్టర్‌ ను మించి ఉప్పెనలో..!

By:  Tupaki Desk   |   16 Jan 2021 9:30 AM GMT
మాస్టర్‌ ను మించి ఉప్పెనలో..!
X
తమిళ స్టార్‌ నటుడు విజయ్ సేతుపతి తాజాగా 'మాస్టర్‌' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. సూపర్‌ స్టార్‌ విజయ్ నటించిన ఆ సినిమాలో విజయ్‌ సేతుపతి నటన పీక్స్‌ లో ఉందనే టాక్‌ వస్తుంది. అత్యంత క్రూరమైన విలన్ పాత్రలో విజయ్‌ సేతుపతి అద్బుతంగా నటించాడు. సినిమా ప్లాప్ అయినా కూడా విజయ్ సేతుపతి నటనకు మంచి మార్కులు పడుతున్నాయి. సినిమా చూడొచ్చు అంటే అది ఖచ్చితంగా విజయ్ సేతుపతి కోసం అంటూ నెటిజన్స్‌ కామెంట్స్ చేస్తున్నారు. ఇక విజయ్‌ సేతుపతి మరింత క్రూరంగా 'ఉప్పెన' సినిమాలో కనిపిస్తాడని అంటున్నారు.

తన కూతురును ప్రేమించిన జాలరి కుర్రాడి పట్ల విజయ్‌ సేతుపతి వ్యవహరించే తీరు బాబోయ్‌ అనేట్లుగా ఉంటుందట. ఆ పాత్రకు విజయ్‌ సేతుపతి అద్బుతంగా సెట్‌ అయ్యాడని యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు. ఉప్పెన సినిమాలో విజయ్‌ సేతుపతి ఎలా ఉండబోతున్నాడు అనే విషయమై ఇప్పటికే క్లారిటీ వచ్చింది. కాని టీజర్‌ లో మాత్రం ఆయన పాత్రను హైడ్‌ చేశారు. సినిమా ట్రైలర్ లో విజయ్‌ సేతుపతిని చూపించే అవకాశం ఉంది. అత్యంత క్రూరంగా విజయ్ సేతుపతి పాత్ర ఉంటుందని ఈ సినిమా సక్సెస్ అయితే మరింతగా టాలీవుడ్‌ లో విజయ్ సేతుపతి బిజీ అవుతాడు అంటూ నెటిజన్స్‌ కామెంట్స్ చేస్తున్నారు.