శ్రీలంక నేపథ్యంలో స్టార్ హీరో కొత్త సినిమా గురూ!

Fri May 29 2020 16:02:28 GMT+0530 (IST)

Vijay Sethupathi New Movie with Venkata Krishna Roghanth

టాలెంటెడ్ యాక్టర్ విజయ్ సేతుపతి వరుస సినిమాలతో బిజీ అవుతున్నారు. ఆల్రెడీ రిలీజ్ కావాల్సిన సినిమాలు లైన్ లో ఉండగానే కొత్త సినిమాలు ఓకే చేస్తున్నాడు. అయితే కొన్ని సినిమాలు హీరోగా చేస్తూనే మరికొన్ని సినిమాల్లో కీలక పాత్రలు చేస్తున్నాడు. గతేడాది సైరా నరసింహారెడ్డి సినిమాతో తెలుగులో ఆరంగేట్రం చేశాడు విజయ్ సేతుపతి. ఆ సినిమా తెలుగు తమిళమే కాకుండా హిందీ కన్నడ మలయాళం ఇండస్ట్రీలకు కూడా విజయ్ ని పరిచయం చేసింది. ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకెళ్తున్న విజయ్ మరో కొత్త సినిమాను ఓకే చేశాడు. ఈ సినిమాతో వెంకట కృష్ణ రోహంత్ అనే కొత్త దర్శకుడు పరిచయం కానున్నాడు. వెంకట కృష్ణ ఇదివరకు సీనియర్ డైరెక్టర్ జననాథన్ దగ్గర అసిస్టెంట్గా పనిచేశాడు. ఈ సినిమాకు 'యాధూమ్ ఊరే యావరమ్ కెలిర్' అనే టైటిల్ ఫిక్స్ చేసినట్లు సమాచారం. అన్నట్లు ఈ సినిమా టైటిల్ కూడా విజయ్ సూచించినట్లు తెలుస్తోంది.ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా మేఘ ఆకాష్ ను ఓకే చేశారు. మొదట్లో అమలాపాల్ హీరోయిన్ గా అనుకున్నట్లు వార్తలు వచ్చాయి. కానీ చివరగా మేఘా ఆకాష్ ని ఓకే చేశారు. ఇక ఈ సినిమాలో విజయ్ సేతుపతి మేఘా ఆకాష్ లతో పాటు మరో కీలక పాత్ర కూడా ఉందట. మొత్తానికి ఈ సినిమా కథ ముగ్గురు సంగీత దర్శకులు చుట్టూ తిరుగుతుందని సమాచారం. అంతేగాక ఈ సినిమా శ్రీలంక నేపథ్యంలో సాగనుందని తెలుస్తుంది. కాగా ప్రస్తుతం విజయ్ హీరోగా కాకుండా కీలక పాత్రల్లో నటిస్తూ స్టార్ హీరో విజయ్ మాస్టర్ తో పాటు తెలుగులో ఉప్పెన సినిమాలో నటించాడు. ఈ రెండు సినిమాలు ప్రస్తుతం విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. అంతేకాక విజయ్ సేతుపతి త్వరలోనే నిర్మాతగా కూడా వ్యవహరించనున్నట్లు సినీ వర్గాలు మాట్లాడుకుంటున్నాయి. చూడాలి మరి విజయ్ వరుస సినిమాలతో మ్యాజిక్ చేస్తాడో లేదో..!