Begin typing your search above and press return to search.

త‌మిళ స్టార్‌ వెంట‌ప‌డుతున్న స్టార్ డైరెక్ట‌ర్స్‌!

By:  Tupaki Desk   |   5 July 2022 11:30 PM GMT
త‌మిళ స్టార్‌ వెంట‌ప‌డుతున్న స్టార్ డైరెక్ట‌ర్స్‌!
X
కోలీవుడ్ లో హీరోగా వెన‌క‌బ‌డిన విజ‌య్ సేతుప‌తి ప్ర‌స్తుతం విభిన్న‌మైన విల‌న్ పాత్ర‌ల‌కు కేరాఫ్ అడ్ర‌స్ గా మారుతున్నారు. ముద్దుగా కోలీవుడ్ జ‌నం మ‌క్క‌ల్ సెల్వ‌న్ అని పిలుచుకునే ఈ విల‌క్ష‌ణ న‌టుడు త‌న‌దైన మార్కు న‌ట‌న‌తో విల‌న్ పాత్ర‌ల‌కు ప్రాణం పోస్తూ ఈ త‌ర‌హా పాత్ర‌ల‌కు విజ‌య్ సేతుప‌తి మాత్ర‌మే న్యాయం చేయ‌గ‌డ‌నే ముద్ర వేస్తున్నారు. ఈ మధ్య హీరోగా చేస్తున్న చిత్రాలు పెద్ద‌గా ఆక‌ట్టుకోలేక‌పోతుండ‌టంతో విల‌న్ పాత్ర‌ల‌కు ప్రాధాన్య‌త‌నిస్తూ బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమాకు ప్ర‌ధాన ఎస్సెట్ గా నిలుస్తున్నారు.

మాస్ట‌ర్‌, ఉప్పెన చిత్రాల‌తో విల‌న్ పాత్ర‌ల‌కు కేరాఫ్ అడ్ర‌స్ ని నిలిచారు. రీసెంట్ గా యూనివ‌ర్స‌ల్ స్టార్ క‌మ‌ల్ హాస‌న్ న‌టించిన 'విక్ర‌మ్‌'తో మ‌రింత గా పాపులారిటీని సొంతం చేసుకున్నారు. ఈ మూడు సినిమాల్లో అత్యంత క్రూరుడైన వ్య‌క్తిగా విజ‌య్ సేతుప‌తి న‌ట విశ్వ‌రూపాన్నిచూపించారు. క‌మ‌ల్ విక్ర‌మ్ లో డ్ర‌గ్ మాఫీయా లీడ‌ర్ సంతానం పాత్ర‌లో త‌న విశ్వ‌రూపాన్ని ప్ర‌ద‌ర్శించిన ఔరా అనిపించాడు. ఈ మూవీ చూసిన ప్ర‌తీ స్టార్ డైరెక్ట‌ర్ విజ‌య్ సేతుప‌తి కోసం త‌మ సినిమాల్లో అత్యంత ప‌వ‌ర్ ఫుల్ విల‌ణ్ పాత్ర‌ల‌ని సృష్టిస్తున్నార‌ట‌.

దీంతో విజ‌య్ సేతుప‌తికి క్రేజీ స్టార్ల సినిమాల్లో భారీ ఆఫ‌ర్లు వెతుక్కుంటూ వ‌స్తున్నాయి. 'పుష్ప‌'లో డేట్స్ కార‌ణంగా న‌టించే అవ‌కాశాన్ని వ‌దులుకున్న విజ‌య్ సేతుప‌తికి 'పుష్ప 2'లో న‌టించే అవ‌కాశం ల‌భించింద‌ని, కీల‌క విల‌న్ పాత్ర‌లో విజ‌య్ అయితేనే మ‌జా వుంటుంద‌ని ద‌ర్శ‌కుడు సుకుమార్ భావించి ఆయ‌న‌ని ఫైన‌ల్ చేసిన‌ట్టుగా చెబుతున్నారు. ఇదే నిజ‌మైతే పుష్ప 2 కు విక్ర‌మ్ కాంబో సెట్ట‌యిన‌ట్టే. 'విక్ర‌మ్‌'లో ఫ‌హ‌ద్ ఫాజిల్‌, విక్ర‌మ్ క‌లిసి న‌టించారు.

ఈ ఇద్ద‌రు ఇప్పుడు 'పుష్ప 2' కోసం విల‌న్స్ గా రంగంలోకి దిగ‌బోతుండ‌టంతో ఈ ప్రాజెక్ట్ పై క్రేజ్ ఓ రేంజ్ కి చేరింది. సుకుమార్ ఈ ఇద్ద‌రిని క‌లిసి 'పుష్ప 2' కు మ‌రింత హైప్ ని క్రియేట్ చేయాల‌నే ఆలోచ‌న‌లో వున్నాడ‌ట‌. ఇదే నిజ‌మైతే బ‌న్నీ ఫ్యాన్స్ కి ఇక పండ‌గే అంటున్నాయి ట్రేడ్ వ‌ర్గాలు. ఇదిలా వుంటే వుంటే తాజాగా మ‌రో భారీ పాన్ ఇండియా మూవీలోనూ విజ‌య్ సేతుప‌తికి విల‌న్ గా న‌టించే ఆఫ‌ర్ ల‌భించిన‌ట్టుగా తెలుస్తోంది.

బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ తో అట్లీ 'జ‌వాన్‌' పేరుతో ఓ భారీ మూవీని రూపొందిస్తున్న విష‌యం తెలిసిందే. ఇటీవ‌లే ఫ‌స్ట్ లుక్ వీడియోని విడుద‌ల చేసి ప్రాజెక్ట్ పై అంచ‌నాల్ని పెంచేశారు. మూవీలోని విల‌న్ పాత్ర కోసం ద‌ర్శ‌కుడు అట్లీ .. విజయ్ సేతుప‌తిని అనుకుంటున్నార‌ట‌. ఇప్ప‌టికే ఆయ‌న‌కు లైన్ కూడా వినిపించార‌ని తెలుస్తోంది. రానా న‌టిస్తార‌ని వార్త‌లు వినిపించినా తాజాగా ఆ ప్లేస్ లో విజ‌య్ సేతుప‌తి పేరు తెర‌పైకి వ‌చ్చింది.

ఈ పాత్ర చాలా క్రూయ‌ల్ గా వుంటుంద‌ట‌. అలాంటి పాత్ర‌ని చేయాలంటే విజ‌య్ సేతుప‌తి త‌ప్ప మ‌రెవ‌రూ చేయ‌లేర‌ని దర్శ‌కుడు అట్లీ ప‌ట్టుబ‌డుతున్నార‌ట‌. విజ‌య్ సేతుప‌తి కూడా అట్లీ ఆఫ‌ర్ కు గ్రీన్ సిగ్న‌ల్ ఇవ్వ‌బోతున్నాడ‌ని, షారుఖ్ గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చేయ‌డ‌మే త‌రువాయి అని వార్త‌లు వినిపిస్తున్నాయి.